పుట:Saripadani Sangatulu by Bellary Raghava.pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మూడవయంకము


తార:-అయ్యా! నీవుచెప్పకున్న నేనుచెప్పివేయుదును. ఉన్నసంగతి బట్టబయలు చేసివేయుదును. నీపగవారిపేరు బహిరంగముచేసెదను.

శ్రీధర;- తార! తార! నాయానవలదుసుమా! నీవట్లుచేసిన.... తారా! నీకు ప్రపంచానుభవములేదు. అనేక సమయములందు మౌనమే యెక్కువఫలము నొసగును. నీవేమైనను నామాటవినక గుట్టుబయలు పెట్టితివా, నిక్కముగ నేను ఆత్మహత్యచేసి కొందును.

తార:-(దు:ఖించును) అయ్యయ్యో! మీకి శిక్షయగునే నేనెట్లు ఓర్తును.

శ్రీధర:- బిడ్డా! ఏడ్వకుము. నాకేమియు బాధకలుగదు. జైలునందు బాధఏమున్నదమ్మా? జైలుబయటజరుగు అధర్మప్రవర్తనము లోపల లేదమ్మ, నీకు తెలియునే! మరియొక్కమాట. ఇప్పుడు మనసమాజములో స్త్రీలను బాదించుచుండు బాధలకంటె, హింసలకంటె కారాగృహమందు కలుగు బాధలు మిక్కిలి తక్కువ అమ్మా! ఈ అవివేకపు ప్రకృతా అచారసంప్రదాయములను జైలుకంటె ఆజైలేమేలమ్మా! ఏడ్వకుము. ఏడ్వకుము. నేనెచ్చటనున్నను నీక్షేమమ్నకయ్యే పరమేశ్వరుని ప్రార్దీంచు చుందును. నీఆరోగ్యమును కాపాడుకొనుము. నీవు దు:ఖపడవలసిన సమయము గాదమ్మ, నేనుత్వరలో వచ్చెదను.

తార:-(ఎక్కువగా దు:ఖించుచు) అయ్యా! నామంచిగదా నీకీసంకటము పుట్టిననాడే నేను చచ్చియుండ గూడాదా?

శ్రీధర:- తారా! నీవట్లనరాదు నాకొరకు...నీ....నీ శ్రీధరునికొరకు సుఖముగ బ్రతికియుందుము. నీవు దు:ఖించిన చూడలేనమ్మ. కోటినరక భాధలుగూడ నాహృదయమును బేదింప జాలవుగాని, నీకంట నీరు పెట్టుట మాత్రము తాళజాలను. నీ వేడ్వకుము. లీలావతిదేవి నిన్నుగాపాడును. నీయందుండు నిర్దోషి యైనప్రానికై నీవుదేవుని ప్రార్దించుచుండుము. నీయట్టివారి

78