పుట:Saripadani Sangatulu by Bellary Raghava.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మొదటి రంగము


(అప్పుడు బీమసేనరావు గారింటి నౌకరువచ్చి లీలావతి దేవితో ఏమొచెప్పును. ఈమె తటాలున ఆస్ధానమునుండి వెడలిపొయెను)

న్యాయా:-(తారనుచూచి) అమ్మా నీవెవ్వరు?

తార:- నేను వకీలు భీమసేనరావుగారి మేనకొడలు.

న్యాయా:-(భీమసేనరావునుచూచి) రావుజీ! ఇదియేమి?

భీమ:-కొర్టువారు క్ద్షమించవలెను. అమృతముండు సముద్రమున అమృతమువలె, విషముగూడ పుట్టుట యెట్లో, అట్లనే సత్కులమున కులభ్రష్టులు పుట్తగలరు. ఈయమ విధవయై కేశఖండనము లేకుండినందున...

న్యాయా:-That is enough. చాలు. మీగృహకృత్యపు మర్మములు మాకవసరములేదు. (తారనుగూర్చి) అమ్మా! నీవపరాధితో మాట్లాడవచ్చును. సెలవిచ్చియున్నాను.

తార:- (శ్రీధరునివద్దకువచ్చి) ఏల అట్లుఏమియు చెప్పక యూరక యున్నారు?

శ్రీధర:- తార! చెప్పుట వలన మాత్రము ఏన్యాయము గలదు?

తార:- అయిన ఈకొర్టు లెందుకు?

శ్రీధర:-కొర్టులా? వకీళ్ళబ్రత్కుకొరకు. ధనవంతుల దుర్మార్గము కొరకు, ఇచ్చట చెల్లునది మాటల లాఘవము, మాటల బరువు. ఇచ్చట దుడ్డు గలవారికే న్యాయముగాని, బీదలనడుగు వారులేరు.

తార:-ఇంతమంది వకీళ్ళున్నారే, ఒక్కరైనను నీకు సహాయము చేయరా?

శ్రిధర;-తారా! వకీళ్ళకు జేబులొ నొట్లుపడిననే నోటిలొ మాటలు కదులును.

తార:- అయిన నీగతి యేమి/

శ్రిధర;-తారా! నాకు దైవమేగతి. నాకొరకై నెనుదు:ఖ పడువాడుగాను. పరమాత్మకు దేవాలయ నిర్భంధము ఆ పరమాత్మ భక్తులకు కారాగృహ నిర్భందము. ఇదియే ఈకాలపుధర్మము.

77