పుట:Saripadani Sangatulu by Bellary Raghava.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మొదటి రంకము


ప్రా-ఇన్:--ముందేమిజరిగెను?

విద్యా:--హెడ్ కానిస్టేంబిల్ మధురపిళ్ళెగారువచ్చిరి. వెంబడి కానిస్టేబిల్ గారువచ్చిరి. నేను సత్యంగా చెప్పుతానండి. ఇది ధర్మస్ధానము- న్యాయస్ధానము. తాము కేవలము ధర్మావతారము...

న్యాయా:--మూడవ హెచ్సరిక సమయము సమీపీంచి యున్నది.

విద్యా:--అయ్యయ్యో! మాటలకుకూడ నిర్బంధమైనచో బ్రాహ్మణలగతిఏమీ? (అని గొణుగుచు) లేదు మహాస్వామి! ఒక్కక్షణములో చెప్పుతాను అంతయు. మధురపిళ్లెగారు బలవంతముచేసి నన్ను పంచాయితీ దారుగా నియమించిరి. ఇల్లంతయు వెదకిరి. మూలకు మూడుకుండలు పేర్చిపెట్టియుండిరి. మేమూ కుండలదగ్గరకు పొయినప్పుడు శాస్త్రులవారు కొంచెము ఆక్షేపించిరి. (అని దగ్గును) అయితే సర్కారుకార్యము చూడండి. పై రెండుకుండలు తీసిన తరువాత క్రిందికుండలో ఒక్కబంగారు పదకము దొరికినదండి. మధురపిళ్ళె గారు దానిని స్వాధీనంచేసుకొనిరి.....

ప్రా-ఇన్:--ఇదియేనా ఆపదకము?

విద్యా:--అవునుస్వామి! అదేవీరణ్ణ శేట్టిగారిది.

న్యాయా:--ఇది శేట్టిగారి పదకము అని మీకేట్లు తెలియును? ఆదినము దేమైనను చూచియుంటిరా!

విద్యా:--లేదుమహాస్వామి. నేనిదివరకు దానిని చూచియేయుండలేదు.

న్యాయా:--అయితే మీకెట్లు తెలిసినది?

విద్యా:--చెప్పిరిస్వామి అక్కడ.

న్యాయా;--ఎవరుచెప్పిరి? భీమసేనరావుగారు చెప్పిరా? లేక హెడ్ కానిస్టేబిల్ వారు చెప్పిరా?

విద్యా:--ఎవరుచెప్పలేదుస్వామి. కొంచెము పొరపాటైనది.

న్యాయా:--పొరపాటా?

69