పుట:Saripadani Sangatulu by Bellary Raghava.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మూడవ అంకము


విద్యా:--లేదు మహాస్వామి! నేనే సహాయము చేయవలయునని పోయియుంటిని. నేను ఒక్కరు పిలువనంపిన పోవువాడనుగాను. నా విషయము తమకంత పరిచయములేదు. తమ తండ్రిగారు మహారాజరాజేశ్రీ గొవిందనాయుడుగారు, వారికి నాయందు మిక్కిలి విశ్వాసము.. వారి బ్రాహ్మణ భక్తి, సదాచారము, దైవభక్తి ఆహాహా.......

న్యాయా:--ఆచార్యులవారూ! కొంచెము ఆగండి. మీరు అడిగిన ప్రశ్నకు జవాబుచెప్పిన జాలును.

విద్యా:--కానిండు మహాస్వామి! తాము ధర్మప్రభువులు, తమకీర్తి, తమయశస్సు, 'దూరాదాకర్ణ్య....."

న్యాయా:--ఆచార్యులవరూ! మీకేమి మంచిమాటలతో అవసర మున్నట్లు కనబడౌ. ఎక్కువమాట్లాడితే మరితొందరగలుగును చూడండి.

విద్యా:--తెలుసును మహాస్వామి! సర్కారు హుకుమేమి తక్కువైనదా! నేను మీదాసానుదాసుడను.

ప్రా-ఇన్;-- చెప్పండి ఆచార్లువారూ! ఆశనివారము ఏమిజరిగెను?

విద్యా:--నావంబడి భీమసేనరావుకూడ వచ్చియుండిరి. ఇంటికి పోవుచుండగా మార్గములో కొంచెము పొడుము నించుకొని ఇంటికివెళ్ళి ప్రాయశ్చిత్తపు విషయంతొ యుపదేశించితిని. వీరు (అని అపరాధినిచూపుచు) బ్రాహ్మణులు లేకనే పని ముగించుటకు పూనికొని యుండిరి. అది అధర్మమని చెప్పితిని. ఏదో యధాశక్తి దక్షిణలులేకనే బ్రాహ్మణకర్మలు జరుగునా? దానికి వీరి తిరస్కారము. అందుకే చూడండి! బ్రాహ్మణ్యము పాడైపొయింది. దేశములో క్షామము గలుగుచున్నది. మీ తండ్రిగారి కాలము ఈకాలము......

న్యాయా:-- ఆచార్లువారూ! ఇదిగో రెండవవాసారి హెచరిక ఇచ్చుచున్నాను. మరొక్కసారి మీరిట్లనే వాగితిరా, చూడండి తపొగృహము లభించును.

విద్యా:--తప్పాయను, మహాస్వామి! క్షమించవలెను.

68