పుట:Saripadani Sangatulu by Bellary Raghava.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మూడవ యంకము


రాజు-అ;- ముఖ్యమయిన పంచాయితీ సాక్ష్యమున్నదయ్యా- ఇంట్లోదొరినట్లు.

సంభాన్:- ఎవరాపంచాయితీ పెద్దమనిషి?

రాజు-అ:-ఆచార్యులవారయ్యా, విద్యాలంకారాచార్యులు.

సుభాన్:- వంకాయచార్లా? ఊ! తెలుసునుస్వామీ, వంకాయలంటే బహుయిష్టము వారికి. అయితే కష్టమే వున్నదుస్వామీ శ్రీధరశాస్త్రికి. ఏమో బగవంతుడున్నాడు. స్వామి ఎవరండి ఆడోళ్ళువచ్చి కూర్చుంటారు కేసుజరిగేటప్పుడు? కేసుజరిగేటప్పుడు?

రాజు-అ:-భీమసేనరావుగారి భార్య, వారిమేనగోడలు.

సుభాన్:-(రహస్యముగా) ఏమిస్వామీ! ఆపిల్లముండ మోసిగర్బయినదా?

రాజు-అ:-నీకెందుకొయి ఆసోదె? కాకితాలు పడవేసి వెళ్ళీపోవోయి.

(ఇంతలోపల కోర్టుదఫేదార్ ప్రవేశించి "కచ్చేరితయార్" అని అరచును. ఒకవైపునుండి న్యాయాధిపతియు, మరియొకవైపునుండి, ప్రాసిక్యూటింగు ఇస్పెక్టరు, కానిస్టేబిల్, వకీలు భీమసేనరావు, వీరివెనుక, లీలావతి, తార, పిదప అపరాధ శ్రీధర శాస్త్రి, అందరువచ్చి తమతమ స్థానముయందు, కొందరు నిలుతురు. కొందరుకూర్చుందురు).

ప్రా-ఇన్:- (లేచి) విద్యాలంకారాచార్లుగారు (అనును)

(వారిపేరు మూడుతూర్లుబిలువబడును. ఆచార్యులవారు చేతికర్రతోడప్రవేశించును)

రాజు-అ:- కట్టేతీసి బయటపెట్టండి. బొనుఎక్కండి.

(వారిచేతికర్రను బేమసేనరావులేచిపుచ్చుకొందురు. ఆచార్యులవారు సాక్ష్యస్ధానములొనికి ప్రవేశించి తిన్నగా పొడుము పీల్చుటకు ప్రారంభించును. ప్రాసిక్యూటింగు ఇన్సక్టరు నస్యముచేయరాదని సైగ చేయుదురు. ఆచార్యులవారు తొందరగా డబ్బీనినడుము చేర్చుదురు. పిదప ఆచార్యులవాని ప్రమాణము చేయింతురు)

ప్రా-ఇన్:- (లేచి) ఆచార్యులవారూ! ఈఅపరాధిని మీకు తెలుసునా?

విద్యా;- ఓహొ! నాకు బాగుగ తెలియును.

66