పుట:Saripadani Sangatulu by Bellary Raghava.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సరిపడని సంగతులు


మూడవ యంకము - మొదటి రంగము.

}}

(కోర్టుహాలు:- ఆస్థానమేర్పరచబడియుండును. స్టేజిముందర ఎడమభాగమున న్యాయాధిపతిస్థానము. ఆస్థానమునకు ఎడమప్రక్కన స్టేజిముందరిభాగమున సాక్షులునిలుచుస్థలము చేర్చబడియుండును. ఈస్థలమునకెదురుగస్టేజిమొందరిభాగమున, కుడివైపున అపరాధి నిలుచు స్థలము. న్యాయాధిపతి స్థానమునకు మధ్యభాగమున జనులవైపు ముఖముచేసికూర్చొనులాగున ఒక బల్ల, కొన్నికుర్చీలుండును. దీని వెనుకప్రక్క స్టేజివెనుకభాగమున కొన్నిబెంచీలుమడును. సమయము -మధ్యాహ్నం మూడుగంటలు, అనగా మ్యాజిస్ట్రీటు ఫలహారమును ముగించివచ్చు సమయము.)


(ప్రవేశము—కోర్టుగుమాస్తా రాజూయ్యంగారు, తనమేజాపైన డిపోజిషన్ సు (కైపీతుల)కట్టుచుండును) (ప్రోసెస్సు సర్వరు సుభాసింగు దస్కత్తు అయిన కాగితములు మేజస్ట్రీటువారి రూములో నుండి తీసికొనివచ్చి గుమాస్తాకిచ్చును.)

రాజు-అ:- దొరగారి టిఫిన్ ముగిసినదా?

సుభాన్ :-ముగిసినది స్వామీ!ఏమొ చాలాయోచనలో వున్నట్లున్నారు.

రాజు-అ:-ఏమీలేదు. ఈకేసువిషయమే!

సుభాన్:- అన్యాయము స్వామీ! ఇరువదియేండ్లుగా మనకందరికి శ్రీధరశాస్త్రులు తెలుసునే. ఆయన దొంగతనము చేస్తాడంటే యేమిస్వామి?

రాజు-అ:-ఆదొరగారికీ అదేఆలోచనే! దీయందేమో మోసమున్నదని అనుమానం పడుచున్నాడు.

సుభాన్;- ఇదివరకేమైనది స్వామీ!

రాజు-అ:-ముగ్గురు సాక్షులను విచారించినారు. వారిలో ముఖ్యము వీరణ్ణశెట్టి గారు. శాస్త్రిగారింట్లో దొరికిన బంగారిపదకము తమ చోరీమాలులోనిదేయని గట్టిగా చెప్పియున్నాడు.

సుభాన్:- ఇదంతా పోలీసువారి పిత్తలాటకమండి. నేను నమ్మను. జేబులో పెట్టుకొనిపోయి ఇంట్లో పడేసింటే పడేసింటారు స్వామీ!

65