పుట:Saripadani Sangatulu by Bellary Raghava.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రెండవ యంకము


భీమ:-పరమదుర్మార్గుడు. సమాజకంఠకుడు. జాతిభ్రష్టుడు. బ్రహ్మద్వేషి., తారకు దుర్భుద్ధులు కడపి భ్రష్టుడుగా చేసిన పరమ నీచుడు.

లీల;-తార ఏమి తప్పుచేసెను?

భీమ:-అయ్యో! నీకేమి మతిపోయినదా? అంతకంటే తప్పుగలదా! కులభ్రష్టతయే!! బ్రహ్మకుల యశశ్చంద్రికలను సంపూర్తిగ మాపిచేయు మహాపాపమే!!!

లీల:-భ్రూణ హత్య మాత్రము మహాపాతకములలో చేరదా? పోనిండు, తార చేసినది పాపమేయనుకొందము. మనకు దయ వలదా?

భీమ:-దయ! దాక్షిణ్యము!! అది శ్రీసర్వేశ్వరుని సొత్తు...... కరుణాధాముడగు రాముని హక్కు. దయ చూపుటకు మనకు అదికారము కలదా?

లీల:-అటులనే శిక్షణకూడ పరమేశ్వరుని హక్కు గదా? శిక్షించుటకు మాత్రము అనకధికారము గలదా?

భీమ:-ఓహో! ఏమితర్కవాదములోనికి దిగితివే! చెప్పెదను వినుము. శిక్షావిధులు లేకపోయిన. సమాజమున పాపము ప్రబలి, జనులు భీతిలేక ధుష్ట కార్యములను చేయుటకు ప్రారంభింతురు. పాపకార్యమును నిరోధించుటకై జనులు మనమున భయముపుట్టింప వలయునని శిక్షాస్మృతి ఏర్పడినది.

లీల;-పొనిండు, ఒకానొకప్పుడు ప్రకృతి సహజమగు నుద్రేకముచే మైమఱచి చేయుకార్యముకూడ పాపమేనా?

భీమ;-ఊ: పాపమే! లీలా! నీప్రశ్నలు నాకర్ధమగుటలేదు. ఇప్పుడీపాపవి మర్శలెందుకు?

లీల:-ఏమియులేదు. తారవిషయమై మీరు పాపమొనరించినదని నుడివితిరి. దానిపై నాకొక సందేహము గలిగినది. తారను బుజ్జగించి లోచేసుకొన్నవారు పాపమొనర్చిరా? లేక ఒడలెరుగక లోబడిన తార పాప మొనర్చెనా? అని

48