పుట:Saripadani Sangatulu by Bellary Raghava.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మూడవ రంగము


శ్రీధర:- రామ! రామ!! నేనట్టి క్రూర కృత్యము చేయుదునా? నవయౌవన కళా ప్రౌఢయగు ఆసాద్వీమణిని చేపట్టు భాగ్యమునకు నేనెన్నటి కైనను అర్హుడగుదునా? అమ్మా! పరమేశ్వరుని సాన్నిధ్యమున పల్కెదను. తార నాబిడ్డ సమానము.

లీల:-మఱియేల విధవావివహపుప్రశ్న?

శ్రీధర:- అమ్మా! తారను భరించు బాధ్యత, తారను హరించిన వారలకదా? అట్టివానికే తారనిచ్చి వివాహము చేయుట యుక్తముగదా?

లీల:-నిజమేకాని, శాస్త్రులవారూ! తారపతి యెవ్వరని కనిపెట్టితిరా? నేనే అడుగవలయునన్న నాకించుక సంకోచముకలిగి యుండెను. అతడు తారను వివాహమాడుటకు సమ్మతించునా?

శ్రీధర;- అమ్మా దీనికి నీసహాయ్యము గావలసినది.

లీల:-(ఇంచుకయోచించి) ఎవడాతారాపతి?

శ్రీధర:- అమ్మా! తారాపతి చంద్రుడే!

లీల:- మీమాటలు నాకర్ధముకాలేదు.

శ్రీధర:-(తలవంచి) చంద్రునకు వేరొక్కనామము రాజు

లీల:-(దిగ్భ్రజెంది) నిజమా?

(లోపలినుంచి భీమేశ్వరరావుగారు కచ్చేరినుంచి వాపసు వచ్చిలోపల మాట్లాడినట్లు ధ్వని వినబడును)

లీల:- (ఆతురతతో) శ్రీధరశాస్త్రి! నాయజమానుల వారు త్వరలోనే వచ్చిరి.నాకేమియు తోచకున్నది. మీరు వెడలిపొండు. ఈసమయమున దైవము నాకు ధైర్యము నిచ్చుగాక యని ప్రార్ధింతును.

(శ్రీధరుడు వెళ్ళును)

(భీమసేనరావుగారి ప్రవేశము)

భీమ:-లీలా! ఆదుర్మార్గుడేల ఇచ్చటికి వచ్చియుండెను?

లీల:-శ్రీధరశాస్త్రి ఏలదుర్మార్గుడు?

47