పుట:Saripadani Sangatulu by Bellary Raghava.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మూడవ అంకము

లీల:-అయ్యా! నీధైర్యము మిక్కిలి శ్లాఘనీయము. నీయట్టిధైర్యము నాకును గలుగుగాక, తార ఎప్పుడైనను నన్ను తలచుచుండునా?

శ్రీధర:-అనవరతము తమతల్లినిబోలె మిమ్ముల స్మరించుచునే యుండును.

లీల:-మరియొక విషయము

శ్రీధర:-సెలవిండు

లీల:-(కొంచము నిదానించి) మారాజా మీయింటికి పదేపదే వచ్చుచుండు మాటనిజమేనా?

శ్రీధర;-నిజము.

లీల:-తప్పునకుగాదు. తల్లిహృదయము....మీకు తెలియని విషయముగాదు కొన్నివార్తలు విని నేను దిగులొందితిని. నిజమరయుటకై మిమ్ముల పిలిపించితిని. ఈవిషయము నేనడుగకముందే మీరూహించియుందురని నేనమ్మితిని. నిర్భయముగ వాస్తవమును వచింపుడు.

శ్రీధర:-అమ్మా! కొన్నిఅంశములను నేను నుడువనని తొలుతనే మీతో చెప్పియుంటిని. కావున ఈప్రస్తావము ఇంతటితో వదలిపెట్టుడు.

లీల:- అయ్యా! నాతోనొక్కటియు దాచకుడు. నాకుమారునియందు నాకెట్టి వాత్సల్యముగలదో తారయందుగూడ అట్టివాత్సల్యమే కలదని సప్రమాణముగ వచింతును. నిజము పలుకుడు. ఎంత నొప్పి గలిగినను న్యాయమునకు తోడ్పడుదును గాని న్యాయవిరుద్ధముగ ప్రవర్తింపను.

శ్రీధర:-అమ్మా! సంతసించితి. ఒక్కప్రశ్న అడిగెదను. మీరు పునర్వివాహమునకు సమ్మతించెదరా?

లీల:-(మిక్కిలియోచించి) శాస్త్రులవారూ! ఇట్టిప్రశ్నకు పండితులు ప్రత్యుత్తరమియ్య వలయును. స్త్రీలకు ఇట్టి ప్రశ్నలకు సమాధానము చెప్పుటకు అధికారము గలదా?

45