పుట:Saripadani Sangatulu by Bellary Raghava.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సరిపడని సంగతులు


రెండవ అంకము-మూడనరంగము.

(భీమ సేనరావు గారి గృహము.)

(లీలావతి దేవి కుట్టుపని చేయుచు కూర్చొని పలుమారు వాకిలి వైపు చూచుచుండగా సేవకుడు ఏ వేశించి)

సేవ: __ అమ్మ గారూ! శ్రీధర శాస్త్రిని పిలుచుకొనివచ్చి నాను. తల వాకిటనిలిచి యున్నారండి.

లీల: ఇంటిలో ఇప్పుడెవ్వరును లేరుకదా!

సేవ: - (తలయూచుచు)

లీల: - శాస్త్రుల వారిని రమ్మనుము,

సేవ: – చిత్తము. (అనిపోయి, పంపగా శ్రీధరుకు ప్రవేశించును.)

లీల:- శాస్త్రుల వారూ! కూర్చొనుడు. మీరువచ్చినందుకు నాకు సంతోషమాయేను. కొన్ని సందర్భముల నిజ స్థితిని మీవల్ల తెల సికొనవ లెనని నాకు కుతూహలమున్నది. మీరు నిర్భీతిగ ఉ న్నదున్నట్టు చెప్పవ లెనుసుమండి.

శ్రీధర:— అమ్మా! అబద్ధ మెన్నటికిని చెప్పను. ఆ అభ్యాసమే చేయ లేదు. అయితే ఒక్క మాట. కొన్ని విషయములు బయలుపటి చుటకు నాకు ఇష్టము లేకపోయిన యెడల మీరు క్షమింతురు గాక.


లీల: __ శాస్త్రీ ! ఎట్టివిషయ మైనను నాతో చెప్పుటకు మీరు సంశ యింపకుడు. కొన్ని కార్యముల నిర్వహించుటయందు పురుషుల కన్న స్త్రీలకే ఎక్కువ కౌశల్యముగలిగి యుండుట మీరు ఎఱుంగని మాటగాదు.

శ్రీధర: __ అమ్మా! చిత్తము.

లీల: - శాస్త్రుల వారూ! మీ రెందుకు గుమాస్తా పనినుండి తొల గింపబడినది. మీ రెన్ని కష్టములు పడుచుండునది, మీమంచి గుణము, నాకు తెలిసియే యున్న ది. ఒక్క ముఖ్యమైన కార్యము మిమ్ముల నే పిలిపించితిని.రాయని వారు కోర్టుకుపోయియు న్నారు. మీరు నిర్భీతిగ కొన్ని సంగతులు నాతో మాటాడవల యును.