పుట:Saripadani Sangatulu by Bellary Raghava.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మూడవ రంగము


శ్రీధర:-అమ్మగారూ! నాయందు మీకుగల విశ్వాసము సదబిప్రాయమునకు నేను మిక్కిలి కృతజ్ఞడ

లీల:-(కొంచెమాలోచనచేసి) శాస్త్రులవారూ! ఇప్పుడు మీకు వేతనమెంత? క్షేమముగ..... కాలమును గడుపు చున్నారా?

శ్రీధర:-అమ్మా! ఆరోగ్యముగనున్నాను. నాకేమియు కొఱతలెదు. వీరణ్ణశెట్టిగారు మాసమునకు ఇరువది రూప్యములనిచుచున్నారు. దానితొ ఒక్కపూట తృప్తికరమగు భోజనమును ఈశ్వరుడొసగుచున్నాడు.

లీల:-(స్వగతముగా) అయ్యో యెంతకష్జపడుచున్నదో!

శ్రీధర:-అమ్మా! ఏలదు:ఖించెదరు? నాకెట్టి లోపమును కలుగదు. మీరెరుగరా? ఒక్కపూట భోజనమే చిక్కక పరితపించు సొదరసోదరీమణులు లక్షలకొలది యున్నారే ఈదేశములొ.

లీల:-శాస్త్రులవారూ! అదిజ్ఞాపకమునకు వచ్చియే దు:ఖించితిని. ఈయోచన నాకు పలుమారు గలుగుచుండును. కలిగినప్పుడంతయు నాకు దు:ఖమగు చుండును. లెక్కలేని జనులు కూటికిలేక వస్త్రములేక అన్నమో రామచంద్రాయని సంకటపడు చుండుట తలచినప్పుడు మనము సుఖించుటయే గొప్పపాపమని తోచును. సంపద పాపహేతువనుట నిక్కమని తోచుచుండును. దైవసృష్టిలో ఇట్టి హెచ్చుతగ్గులేల కలుగ వలయును? అర్ధమేగాదు.

శ్రీధర;-అమ్మా! మిమ్ములను దైవము రక్షించుగాత, మన ప్రకృతసమాజపు దుష్ట సంప్రదాయములు సవరణకాని, సంహరణగాని చెందువరకు నాయట్టివారు ఈ హెచ్చుతగ్గులు పరమాత్ముని లీల యనియే భావించి తృప్తి చెంద వలయును.

లీల:-శాస్త్రులవారూ! ఈవేదాంతము వలన నామనస్సునకు సమాధానము కలుగదు. ఒక్కొక్క తూరి వేదాంతము సహితము మనసును భ్రమింప చేయు మిధ్య యనియే తోచును. వేదాంతము వలన వ్యావహారిక దు:ఖోపశమనము కలుగునను నది కల్ల. జగద్రక్షకుడు కేవలము కుత్సితగుణ ప్రధానుడని మనస్సునకు ఒక్కొక్క తూరి శంక కలిగియే తీరును.........