పుట:Saripadani Sangatulu by Bellary Raghava.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సరిపడని సంగతులు

మొదటి యంకము - రెండవ రంగము.

(మొదటిరంగమునకు ఈరంగమునకు నడుమ రెండుమూడు దినములు కాలము రాత్రి 9 1/2 ఘంటలు, వెన్నెల వెలుతురు కొంచెము మందముగా నుండును. వీదిలొ జనుల సంచారములేదు.

లోపలినుంచి శ్రీఆంధ్రనాటక పితామహుని ప్రమీలా నాటకము యొక్క ఉత్తర రంగములోని-

   "ఏరాజ్యంబున దరుణు లు
   దారకళాకుశల సుస్వతంత్రలుగలరో
   యారాజ్యంబున బురుషులు
   ధీరులు నదికారు లమధీసువిచారుల్"

అనుపద్యము చదువుచు కాలేజి స్టూడెంట్లు భాస్కరుడు, రాజా, రఘునాధాచారి, మరియు గుమాస్తా శ్రీధరుడు ప్రవేశింతురు)

భాస్కర:--ఆహా! ప్రమీలా పార్టుచేసిన కుర్రవాడు ఎంత రసవంతముగ ఆక్టుచేసినాడురా? ఆడుదాని శక్త్రిముందు మగవానిది ఏమినిక్కుతుంది. అర్జునుడో ప్రమీలా మహారాణిని చూడగానే తరతరలాడి డంగు అయిపోయినాడు రఘునాధా! చూచితివా! ఆడువారిని ఎప్పుడునునేలపెట్టి కాలరాచవలెనని వారించు చుంటివే, ప్రమీలారాజ్యములో ఏమి తక్కువగ నుండె? ఒక్క మగపురుగైన లేకనే ఎంతశక్తితొ, ఎంత శోభావహముగ ప్రమీలా రాజ్ఞ రాజ్యమేలుచుండె? అందులకే కవి చక్కగా వ్రాసినాడు;.

   "ఏరాజ్యంబున జెలు లవి
    చారలు పరతంత్రలస్తసత్వలుగలదో
    యారాజ్యము పురుషు లవా
    ధారులు నవిచారు లస్వతంత్రవిహారుల్"

రఘూ:-- పోరా! పోరా!! నాయభిప్రాయ మేమన-అర్జునుడు దలదలచి ఆడుదాని కెందుల కపజయము కలుగవలెనని ఆమెను

15