శారదలేఖలు
69
పూజాపురస్కారము లన్నిటికిని టిక్కెట్లు, టిక్కెట్టులేక రైలులోనికెట్లెక్కనీయరో, నాటకమునకెట్లు రానీయరో, ప్రదర్శనములనెట్లు చూడనీయరో, అట్లే టికెట్ లేక దేవాలయములోనికిగూడ రానీయరు. సమస్త హైందవులును సాధారణముగా దర్శించి పూజించి పరితృప్తినందవలసిన దేవాలయములు ఆధునికనాగరిక మర్యాదలనుబట్టి ప్రదర్శనములవంటి శాలలుగామారిపోయినవి. అనగా సంపత్తిగలవారికే స్వామిదర్శనమన్న మాట. రుసుములేక స్వామి నిర్మాల్యపు పూరేకైన లభింపదు. స్వామి దర్శనము కేవలమీ టికెట్‌తోడనే కాదు. లంచపంచము లిచ్చుటకుగూడ పాల్పడవలెను. ఇన్ని పాట్లుపడినమీదట స్వామి దర్శనము. దక్షిణదేశముననేగాని యిట్టియనుచితపద్ధతులు ఉత్తర హిందూస్థానమున లేవని చెప్పుదురు. సుప్రసిద్ధమైన కాశీక్షేత్రమున విశ్వేశ్వరుని ప్రతివారును స్వయముగాతాకి పూజింప వచ్చునట. దక్షిణదేశ దేవాలయములయందు పైవిధముగా నిర్బంధములును ప్రజాపీడయు పేదలనిరసనమును మిక్కుటముగా నుండుటచే స్వామిసాన్నిధ్యమున జనులకు నిజముగా కలుగవలసిన ఆస్తిక్యభావము శూన్యమగుచున్నది: పై పెచ్చు అచ్చటి అక్రమములు పీడలు దౌర్జన్యములు చూచుటచే మనస్సునందొకవిధమగు కల్లోలమును, అసహ్యతాభావమును గూడ గలుగుచున్నది. సగుణోపాసన పామరజనులు తరించుటకై యవసరమని కొందఱు వాదింతురు. అది నిజమేనని యొక విధముగా నంగీకరించినను దేవతామందిరములలో నుండవలసినంత పవిత్రతయు, శాంతిశ్రద్ధలును లేమింజేసి నేటి హిందూ