7
నుండు”నని తెలియఁగలము. వాటిలో నీలేఖలయందున్నది "సొగసైన వాడుకభాష" ఔను - "సొగసైన వాడుకభాష"యే. ఇది సజీవము. సమలంకృతము. కాలము ననుసరించి నూతనముగ నొక తెనుఁగువ్యాకరణము రచియింపఁ దలఁచు వారికిది ప్రప్రధమాధారము. ఈమె పద్దెములనుగూడ వ్రాయఁగలదు కాని గద్యరచనయందే మక్కువ యెక్కువ. 'చచ్చి చెడి' యల్లిన "చేపలబుట్ట"కంటె శ్రమలేక యల్లిన చక్కని చిక్కనిచాప, బహుతరోపయోగకరమనుట సరసు లెరుగురా !!
ఇంక నిందలివిషయములు "హిస్టరీ, జాగ్రఫీలూ యిండ్లలో గుట్లూ” గావు! ఈనాటి విద్యాధికుల తీవ్రతర తర్కోప తర్కముల కాస్పదములై యొప్పుచున్న రాజకీయ సాంఘిక నైతిక మతాది మహత్తరవిషయములు. అవియు స్త్రీల కెంతవరకు సంబంధించియుండునో యంతవరకు నిష్పాక్షికముగ, నిర్వక్రముగఁ బరిశీలింపఁ బడి ప్రాగ్పశ్చమములకుఁ గర్మసిద్ధాన్త సమన్వయముఁ జేయుచున్నవి. ఐనదానికినిఁ గానిదానికిని బురుషనిందసేయుట యను పకార్యమిందు మందునకైనఁ గానరాదు.
ఆర్యావర్తమందు ఆనాడువలె నీనాడు నుండవలసిన గృహలక్ష్మీస్వరూప మిందు సమగ్రముగాఁ జిత్రితమైయున్నది. వివిధవర్ణనలతో సరసాలంకార శోభితమై వ్యంగ్యప్రధానమై