Jump to content

పుట:Sarada Lekhalu Vol 1.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

6

"నా విద్యావిషయమున నేను స్వయంకృషిచే నలవర్చుకొన్నదానికంటె, మాసోదరులు ప్రోత్సహించి నేర్పినదానికంటె, నాభర్తగారి సమ్మతియు సానుభూతియు ముఖ్యముగా ప్రస్తుతింపతగినవి. ఈవిషయమున వారిఋణము నేనేవిధముగను తీర్చుకొనంజాలను. చదువుటయందును వ్రాయుటయందును నాకెంత కుతూహలముండిన నేమి ! వారొక్కమాటతో నిరోధించినచో నాగిపోవలసినదే కదా ! వారెప్పుడు నట్టిప్రాతికూల్యత నావిద్యావిషయమున చూపకపోవుటచేతనే నేను, గతపదునారు సంవత్సరములనుండి, వ్యాసములను, లేఖలను, కథలను విరచించి, వివిధపత్రికల కంపుటకును, సం 1931 రములో స్త్రీసమాజము నెలకొల్పి దాని యభివృద్ధికై నిరంతరకృషి చేయుటకును, నా పొత్తములను ముద్రించి యాంధ్రమహాజనుల కరకమలముల నర్పించుటకును అవకాశము గల్గినది. కావున పూజ్యులగు నాభర్తగారి సానుభూతి, యన్నిటికంటె మిన్నయైనదని నేను కృతజ్ఞతతో విన్నపము చేయుచున్నాను.” అని.

ఔనుకదా మరి ! "అస్తీనేదు-గస్తీనేదు పల్లకతొంగోయే” యన్నయట్టి భర్తలే యధికముగా నుండిన యప్పటి పరిస్థితులయం దిట్టి నవోఢలకు భర్తృముఖమునఁ గల్గు నిట్టి విద్యాప్రోత్సాహము సామాన్యమా !!

ఈయమం గూర్చియుఁ దత్కృతములగు నీలేఖల గూర్చియు సం॥ 1930 రపు టేప్రిల్ మాసమందును. సం॥ 1933 రపు సెప్టెంబరు మాసమందును వెలువడిన 'గృహలక్ష్మి' దిలకింత్రుగాక !

మరి యీమెవ్రాసిన 'విశ్వామిత్ర' మొదలగు నితర గ్రంథములఁ జదువుదుమేని “ఈమెశైలి రెండుమూడు రీతుల