శారదలేఖలు
63
తంజావూరు వెళ్లితిమి. తంజావూరు చారిత్రక ప్రసిద్ధమైన నగరము. చోళరాజులకు రాజధాని. అచ్చటి ప్రసిద్ధమైన బృహదీశ్వరాలయము చోళరాజులు కట్టించినదే. బృహదీశ్వరాలయపు గోపురమువంటి గోపురము మఱి యెచ్చటనులేదు. దాని నీడ భూమిపై పడదట. అది శిల్ప శాస్త్రజ్ఞుల నైపుణి యని యచ్చటి వారందురు. ఆ గోపురపు ప్రశస్తినివిని విదేశీయులు గూడ దానిని చూడ వత్తురట, ఆ యాలయములోని నందిగూడ చాల యద్భుతముగా నున్నది. ఆ దేవాలయపు గోపురముమీదను మండప స్తంభములమీదను ఉన్న ప్రతిమలు చిత్తరువులు ప్రాచీనుల శిల్పకళానిపుణతను చాటుచున్నవి. ఆ దేవాలయమేగాక తంజావూరిలో చూడదగిన విశేషములు మఱికొన్ని యున్నవి. అందు ముఖ్యమైనవి పూర్వరాజుల కోటలు, రాజమందిరములు, వారి ఆయుధములు, వాహనములు, వారి చిత్తరువులు మున్నగునవి. వానినెల్ల మేము చూచితిమి.తిరుమలరాయునిదర్బారుమందిర మెంతయో రమణీయముగ నుండి నిన్న నేడు నిర్మించినట్లు కొంగ్రొత్తగ నున్నది. తిరుమలనాయుని శిలాప్రతిమగూడనందు గలదు. తిరుమలనాయుని చిత్తరువులేగాక మహారాష్ట్ర ప్రభువుల చిత్తరువు లనేక మందు గాంచితిమి. తంజావూరు మహారాష్ట్ర పాలనకెప్పుడు వశమైనదో జ్ఞాపకములేదు. ఆ విషయము తెలిసికొను నిమిత్తము చరిత్రను జదువ నుద్యమించుచున్నాను. ఇంతియే గాక తంజావూరు కోటలో మఱియొక చూడదగిన మందిరమున్నది. అది సరస్వతీమహల్ అను పేరుగల ప్రాచ్యలిఖిత