162
శారదలేఖలు
ముగా నిందింపుచున్నాము. వారినట్లు మనము దూషింపుచు మనముగూడ నదియేపని కవకాశమును గోరుట సమంజస మగునా?
కల్పలతా! దాంపత్యముయొక్క పరమార్థము మహోత్కృష్ఠమైనది. దానియొక్క లక్ష్యము కేవలము భోగలాలసతగాదు. కాన దాంపత్యధర్మమును కేవలము భౌతికదృష్టితోఁ జూచి విషయతృప్తియే పరమావధిగానెంచి పెండ్లిపై పెండ్లిగోరుట ప్రశస్తమగు యోచనకాదు.
ఒక పార్శ్వమునకు వ్యాధిసోకినచో దానిని నివారించుటకు రెండవపార్శ్వమునకు గూడ నా వ్యాధిని ప్రాకించుట వ్యాధి నివారణకు మార్గముగాదు. ఒకవంక పురుషు డొనరింపుచున్న దారాపరిత్యాగము అనుచితము నక్రమము సంఘ విచ్ఛిత్తికి కారణము పాపభూయిష్టమునై హిందూసంఘసౌష్టనమునకెనలేని యపకృతిగావింపుచున్నది. నేడు స్త్రీలకు గూడ నట్టి యవకాశ మొసగినచో నాలోపము నివారణమగునని భావింపరాదు. బహుశః యిబ్బందియగును.
మానవజస్మ మెప్పుడును లోపరహితముగాదు. ఎంత మంచివారియందును నేదియో యొక లోపముండితీరును. అట్టిచో నెంతయన్యోన్యానురాగముగల సతీపతులఁయందైనను నెప్పుడోయొకప్పు డేదియోయొకప్పు డభిప్రాయ భేదములు గలిగి తీరును. అంతమాత్రమునకే ఆడుది మగనిని, మగవాడు పెండ్లమును మార్చుకొనుచో నిక నాసంసారములో సారస్య