112
శారదలేఖలు
సౌభాగ్యవతి కల్పలతకు—
నెచ్చెలీ!
చూచితిని, సమదర్శినీగర్భశుక్తిముక్తాఫలమగు ఉగాది సంచికను చూచితిని. చక్కని కాగితములతో ముచ్చటైన అచ్చుతో రమ్యములైన చిత్తరువులతో మనోహరములైన భావగీతావళులతో దివ్యములైన వ్యాసములతో సంచిక రమణీయమై యొప్పారుచున్నది. ఆఱేండ్లు నిరాఘాటముగా చెన్నరాజధానీప్రజాయత్త శాఖల బాలించిన ప్రతిభాశాలియగు నా సచివశేఖరుని రాజలాంఛనాలంకృతంబగు త్రివర్ణముఖ చిత్రము నిజముగా నాసంచిక కపూర్వశోభనే గూర్చుచున్నది. రాజకీయసాంఘికార్థిక సారస్వతానేక విషయములనుగూర్చి వ్రాయబడిన ప్రసిద్ధవ్యాసములు పునఃపునః పఠనీయములై తనరారు చున్నవి. అందందు తనరారుచున్న పద్యమాల లాసంచికాబాలకు మణిహారములే! సందియములేదు. కాని యెట్టి చక్కదనాలచుక్కకైన ఇంచుకంతలోప ముండకపోదు. విధాతృ సృష్టిలోనే యిట్టిలోటు సర్వసాధారణముగా కనిపించుచుండును. ఇఁక మానవసృష్టియందుండుటలో వింతయేమున్నది? పాశ్చాత్య స్త్రీలనుగూర్చి వ్రాయఁబడిన వ్యాస మాసంచికలోఁ జేరుట నిజముగా నాసంచిక కొకకళంకమనియే చెప్పవచ్చును. అయినను నీ విషయమై యాసంచిక నిర్వాహకులనుగాని యావ్యాసకర్తనుగాని యనవలసిన పనిలేదు. వారి పత్రికానామమే వారి