పుట:Saptamaidvardu-Charitramu.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

48

సప్త మైడ్వర్డు చరిత్రము.


తత్పూర్వము కొద్దిమందికి మాత్రము తెలిసిన ఎడ్వర్డలెగ్జాండ్రా వివాహము అందఱును ఎఱింగి, దానిని గనుటకుగుతూహలాయ త్తచిత్తులై యుండిరి. ఈవాహమువలన రాజ్య ము సిరిసంపదలు మిక్కిలివర్ధిల్లు నని అనేకులు కోరిరి.రాణికి లోబడిన రాజ్యంబులలోని జనులు తమరాచబిడ్డ కు సదాచార సంపన్నురాలును, సుగుణగణమణీయును, సౌందర్యము భాంగియును, అయినటు లెగ్జాండ్రా రాచకూఁతును వివాహమాడ బోవు ననియును, ఆపరిణయంబును గాంచవలయు ననియును, కోరిరి. ధననంతులును, రాఁగలిగిన వారును మాత్రము ఇంగ్లండునకుఁ జనుదెంచి యూవివాహమ మోత్సవమునుజూడ నుద్యమించిరి.. అనేకులు తాము రాలే మని నిరాశ చేసికొని తమతమ యింటి పట్టులయందే యుడి ఎడ్వ, లెగ్జాం డ్రుల వినాహము నిర్విఘ్న ముగఁ బరిసమాప్తిస్ నొందవలె సని కోరు చుడిరి.

డెన్నార్కు రాజతనయ యగున లెగ్జాండ్రి" ఇంగ్లమునకు క్రొత్తది కాదు. ఆపురికి రెండుమూఁడుతడవలాకన్నియ పసి తనంబున వచ్చి దానిసొబగును, గాంభీర్యంబును, జనులకు: జూపి ఉండెను. ఆమె తన మేనయత్త యైన కేం బ్రిడ్జి రాణిని జూడనే తెంచిన పుడు లియొసాల్డను భూనేతను జూడఁ బోవు చుండిన విక్టోరియాను గాంచెను. ఆమహారాణి అప్పుడే అడెన్మార్కు ప్రభుతనయను గని దానివినయగాంభీర్య సౌశీల్యాది సద్గుణం