పుట:Saptamaidvardu-Charitramu.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నా ల వ అధ్యాయము47


త్నములు సేయుచుండెనని విని జర్మని దేశపు రాజుకూఁతుండ్ర పటములను, స్వీడ దేశపు ఱేసిపట్టి ఫలకమును, ఇట్టివి యెన్నియో అనేకములు ఇంగ్లండు రాణీ సముఖమున వచ్చి యి చ్చెను. రాణీ వానిని గాంచి ఎడ్వర్డునకుఁ జూ పెను అతఁడునానిని జూచియుఁ జూడనియట్టుల నుండి వానియొడ దనకుగలయ నాదరణను గాన్పించెను. బుద్ధిశాలియైన సుహారాణి వానిభావం బెంఱింగి అయాపటము లాయరాజ్యములకుబంపెను. అంత రాణి ఎడ్వర్డు మనోభీష్టంబుఁ దెలిసికొని డెన్మార్కు రాతనయను వివాహమాడఁ దలంచినాఁడని ఊహించి ఆదేశ పుటోడయనికి నాశుభవర్తమానమును దెలియఁబంపె.అతఁడునుతనకూఁతునకుఁ దగినవరుఁడు లభించెనని మహానంబు నొంది, శుభముహూర్తము నిశ్చయింపవలసిస దని రాణికి నెరుక పరచెను. ఆమెయును మంత్రులతోను కాంటెర్బెరి ఆర్బీబిషపు తోడను, ఆలోచించి 1862 సం. న ఫిబ్రవరి నెల 16 వ తేది నాడు 'పెండ్లి ముహూర్తమును నిర్ణయించినటుల శుభ వర్తమానమును - డెన్మార్కు, ప్రభువునకు నెఱింగిం చెను. అతఁడు ఇంగ్లండునకుఁ దనతనయను వెంట నిడుకొని వత్తు నని రాణికి సమాచారమును బంపెను. ఇటుల రెండిండ్ల వారును బెండ్లికి వలయు నుద్యమములు సేయుచుండిరి !

రాజమంత్రులు ఎడ్వర్డునకు డెన్మాగ్కు- ప్రభువు పుత్రిక నిచ్చి వినాహముజరుగు నని లండను పత్రికలలో ప్రచురించిరి.