పుట:Saptamaidvardu-Charitramu.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

46

సప్త మైడ్వర్టు చరిత్రము.


సేయు చుండెను. అప్పుడు వారిలో నొకని చేతిలో గాగితపుటట్టపై వ్రాసిన చిత్రపట మొక్కటి ఉండెను. ఎడ్వర్లు దానిని గైకొని చూచి, డెనార్కు ఱేనిపట్టి అని యెఱింగి, ఆ మేనియం దంబును డెందంబున 'మెచ్చుకొని, అమె పై వలపుఁ గొని దాని వెలిబుచ్చక, అతరుణీమణిని గనుంగొనఁ గోరు చుండెను. ఆదిమొద లాతడు ఏపనులయందు నాసక్తి లేక ఆ చెలియపై మోహ ముంచి, ఆమే నెప్పు నెప్పుడు గనుగొందు నా యని ఉవ్విళ్లూరు చుండెను. ఇంతలో మంచి సమయము తటస్థించెను. డెన్మార్కు. రాజు తన ప్రియపుత్రిక యగు నలెగ్జాండ్రాలో హిడల్ బర్గునకు వచ్చునటుల డెలియ వచ్చెను, ఎడ్వర్డు ఆమాటను విని అచెలియ: జూచి వచ్చుటకు నాచోటికి వెళ్లెను. అచ్చట సంతకుముం దే ఎడ్వర్డు రూపు కలచిత్ర పటమును గాంచి యాతనిఁ జూడవలయు నని యపేక్షించు చుండిన ఆ లెగ్జాండ్రా ఆతనిని జూచి సుతుష్టాం తరంగయయ్యే. ఆతడాకన్నియుఁ గాంచి, తదీయ రూప లావణ్యాదిగుణంబుణంబులం గని విమోహితుం డై ఆమె చూపు లను సంకెలల చేఁ గట్టఁబడిన హృదయము కలవాడడై యాచోటువిడువ నొల్లక ఎట్టకేలకు కొంత దైర్యము తెచ్చుకొని " ఆఁడు దాని యందమునకు మింతలో మగ వారు బేలు పోఁగూడునా?" అని స్వాంతంబునఁ దలంచి, తనయింటికీ జనుదెంచెను.

ఇంగ్లండు నేలురాణి తనకుమారునకు వివాహ ప్రయ