పుట:Saptamaidvardu-Charitramu.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

44

సప్త మైడ్వర్డు చరిత్రము,


ఆల్బర్టు మోమువన్నె రానురాను కృశించెను. దంతచ్ఛాయ డీలుపడెను. 'పెదవులు నల్ల నయ్యె. ఆల్బర్టు, జుట్టు ముట్టి ఉండిసరాణి ప్రభృతులు ఈచిహ్నము లన్నీ యుఁ గాంచి, ఆల్బర్టు మృఁతి జెందెనని నిశ్చయిం చిరి. రాణీ గొల్లు మని యేడ్చె. ఆయనుపుత్రుడు ఆక్రందనము సేసె. మిగిలిన 'వాండ్రును మిగుల దుఃఖంచిరి. మంత్రు లింతలో విచ్చేసి, రాణికీని ఎవ్వ ర్డునకును, ఊఱటపలుకులు సెప్పి, ఆల్బర్టు శరీరమును, సమస్త రాజచిహ్నములతో వింజరు నుండు సెంటుజార్జి చేపలుస బూడ్చిరి. అప్పుడనేక పరరాజులును విచ్చేసి, రాణికి నామెతన యునకును దుఃఖోపశాంతి వచనంబులు పల్కి, నా యుమ్మలికంబును దొలఁగఁ జేసి, తమతము దేశములకు వెళ్ళిరి . ఎడ్వర్డును, తండ్రి మరణమున కై సర్వదా దుఃఖించుచుం డెను. అతఁడు తనపనులన్నింటిని వదలుకొని, "తండ్రిపోయెను, మనమును పోవు వారమే కదా ? మనకు నీరాజ్యంబు 'లేల ? గీజ్యంబు లేల పుట్టుట చచ్చుట కొరకే, ప్రాపంచిక సౌఖ్యంబు లస్థిరంబులు, ఉన్నంతవఱకు ధర్మ కార్యములు సేసి కొనుచు,భగవప్రీతికర మగుమార్గమున నడుచుచు నుండుట మేలు." అని తలంచి, రాచకార్యంబులకు మనస్సుఁ దగులనియ్యక ఉండెను. రాణియును, మంత్రులును, ఎడ్వర్డు తండ్రి మరణముచే గలిగిన విరక్తిని నుండెనని యెంచి, ఆయన మనస్సు రాచకార్య ములపై విరుగునటుల వాని బురికోల్పిరి. అతఁడును తల్లిమా