పుట:Saptamaidvardu-Charitramu.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మూడవ అధ్యాయము.

43


తక్షణ మే వచ్చి దివ్వౌషధముల నిచ్చిరి . రానురాను రోగము ప్రబల మయ్యెను. వైద్యులు ఆల్బర్టు బ్రతుకఁ డని నిరాశ చేసి కోనినవారయ్యును, ఆఛానమును వెలి నిడిన రాణీగారు దైర్యమును గోల్పోవుదురని తలంచి, ఏమేమోమందుల నిచ్చు చుండిరి. విక్టోరియా తననాథుఁను జీవించడని నిశ్చయించుకొనెను. ఆమెహృదయసముద్రమునుండి శోకతరంగంబులు కన్ను లను చెలియలికట్ట మేర దాటి పాయలుగ వచ్చుచుండెను. కాని అదేవే తనశోకము నెలింబుచ్చినం బస్సిండ్రు మిగుల దుఃఖంచి దిగు లొందుదురనియేచి దాని లోన నడుచు కొని, అదేవేరితనశోకమును వెలిబుచ్చిన బసి వాండ్రు మిగుల దుఃఖింతురని యెంచి దాని లోన నడంచు కొని అశ్రు కణంబుల గొనగోట జిమ్మివైచుచుండెను.


రాణి రెండవకూతెఉరు ప్రిన్సన్సు అలిన్సు అను చిన్నది పసి దయ్యును, బుద్ధిమంతురాలును, దీర్ఘాలోచన కలదియును, ముందు నేమి కలుగునో అని సంశయించి, కేబ్రిడ్జులో నుం డిన తనయన్న కుఁ దండ్రి జబ్బుస్థితిలో నుండే సనియును, బ్రతుకుట దుర్లభం బనీయును, తంతెవార్త చేసెను. అతఁడామూటను విని, శోకముచేఁ బీడింప బడినవాఁ డయ్యును, ధైర్య లక్ష్మిని త్యజింపక వాయు వేగ మనో వేగంబుస వింజరుభవసముఁజేరెని.

అతఁడు తనతండ్రి యైనఆల్బర్టు మరా ణానస్థలో నుంటఁగాంచెను. హృదయము శోక పూరిత మయ్యె. కనులనీరుజులజల రాలి చిన్న చిన్న కాలువలై కడపట గొప్ప ప్రవాహము లయ్యె - .