పుట:Saptamaidvardu-Charitramu.pdf/20

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రెండవ అధ్యాయము

9


ఇంతలో నామహారాజ దొమ్మిది నెలలు సంపూర్ణములయ్యే. కాని అదేవేరి యిసుమంత యైనను శ్రమము సెందక నడుము బలిసి దేహము భారముతో నుండినను అటు నిటఁ దిరుగాడుచు నే ఉండె. 1841 వ సంవత్సరమున నవంబరు నెల 8-న తేది నాడాయిల్లాలు సంపూర్ణ గర్భభారమున బకింగ్ హామున తిపుర పుటు ద్యానవనమున నుదయంబునఁ గోంత కాలము నడిచెను; నాఁటి మధ్యాహ్నంబున నాయమ బండిలో గొంతదూరము కాని పోయెను. సాయంకాలమునందనయింట నడిచినవిందు. నారగించి, యచటికి విచ్చేసిన వారితోఁ గొంత కాలము ముచ్చట లాడుకొను చుండి సుఖనిద్రఁ జెందెను.


ఇంతలో గోడి కూసెను. తూర్పు దేసం జుక్క వుడమె.పిట్టలు చెట్టులతుదకు కిలకిలా రవములు సేయఁ దొడంగెను.చీకటులు మూలమూలలఁ బరుగిడఁ జొచ్చెను. అరుణోదయమయ్యే. ఉదయాద్రిని మిత్తుండు వుడమెను. వందిమాగధులు విక్టోరియా రాణిని నిదుర లేపుటకు గానము సేసి.. అతరుణీ మణియును కొంచె మలసటతో లేచి భగవంతుని ధ్యానించి,యుదయ కార్యముల నెరవేర్చి యప్పుడప్పుడు నడుము క ళుక్కని నొప్పీ సూపినను దాని నంతగ గమనింషక వేదన లేని దాని కై వడి రాచ కార్యములను విచారించు చుండెను. కాని రానురాను ఆబాధ మఱింత వృద్ధి చెందెను. అయిల్లాలు మిక్కిలి యోర్పుతో. నా వేదన ననుభవించు చుండెను. ఉదయ