పుట:Saptamaidvardu-Charitramu.pdf/163

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

150

సప్త మైడ్వర్డు చరిత్రము.


బులఁ బాలించు చుందురు. వార లింగ్లండున నొక సభ గావించిరి. ఎడ్వర్డు వారిని సగౌరవమున నాహ్వానము సేసి, వారిని మిగుల గొండా డెను. నేరస్థులను విచారించుటకు న్యాయస్థాన మొకటి ఏర్పడెను. ఎడ్వర్డు దాన్ని దెఱచి అందున్యాయాధికారులు న్యాయాన్యాయములఁ జక్కఁగఁ బరిశీలించి అనత్య విరోధు లై ఉండవలయునని వక్కాణించెను.కార్డిఫ్ అను పురంబున నోడలు నిర్మించుటకు దొరురు వంటి దొకటి త్రవ్వ బడెను. దానికి " అలెగ్జాండ్రా డాక్ " అని పేరు పెట్టబడెను.ఎడ్వడు దానితూము దెఱచిన పుడు గనులలోఁ బని 'సేయు కూలివాండ్ర ప్రాణములు: గాపాడు వారికిఁ దన పేర నొక పతకమిచ్చునటుల మాట చెప్పెను.

1908 సం. న ఎక్వర్ణ లెగ్జాండ్రులు, తమ రాజ్యమునువదలి డెనార్కునకును, స్వీడను, నార్వే, మున్నగు రాజ్యములకును వెళ్లి, ఆయా రాజుల గని వారు సేయు సపర్యలను బొరసి తమనీటికిఁ జనుదెంచిరి. ఈయేఁటఁ బోర్చుగలు దేశాధీశ్వరుని నాతని రాణి నాదేశమున నుండు నేక రాజ్యాధిపత్యము నొల్లనివారు మృత్యువువాతఁ బెట్టిరి. అ నేక బ్రభువు లాతుంటరుల చెడు చెయ్దం బులం దలచి తమ ప్రాణముల నర చేతుల యందిడు కోని భయా క్రాంత స్వాంతులై ఉండిరి. అయిన ఎడ్వెర్డును అతని రాణియును, ఆయనకుమారుఁ డైనయువ రాజును, కోడ లును, "సెంటు జేమ్సుస్పానిషు దేవాలయమునను, " సెంటుపాలు