పుట:Saptamaidvardu-Charitramu.pdf/150

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తొమ్మిదవయధ్యాయము

137


ఎడ్వర్డు తన యుమ్మిలికంబు నుపశమింపఁ జేసికొని, తల్లి కిఁ బరలోక క్రియలు నిర్వర్తించి రాచ కార్యములు సేయఁ బూ నుకొనెను. మఱుసటి దినంబున నాతఁడు సెంట్ జేమ్సు నగరుస ఇంగ్లండు దేశ రాజ కార్య ధురంధురుల మ్రోల నిట్లు ప్రసంగించెను........

“మాతల్లి గారు చనిన తోడ్తో రాజ్య భారనుంతయును మేము వహింపవల సినవార 'మై యున్నారము. మేము మన దేశ చట్టములకు లోబడి క్రమము తప్పక రాజ్యముఁ బాలింపవలయు ననియు, మా మేన బ్రాణ ముండు పర్యంతము. మాజనులను క్రమమార్గమును బాలించి వారు మంచిదిశకు వచ్చుటకు బాటుపడు చుండు వారము.

మాకుఁ బూర్వము మావంశస్థులలో నార్గురు రాజులకు నెడ్వెర్డని ఉండిన పేరుతో "నేను ఏడవయేడ్వడ్డని వ్యవహరింపవలయు నని నిశ్చయించు కొని ఉన్నాను. సత్యమార్గమున నడిచి, లోకులకు మేలు సేపి, జగద్విఖ్యాత యశులను, కీర్తి శేషులును, అయిన మాతండ్రి పేరును 'ఎడ్వర్డు' అను నామము నకు ముందుఁ జేర్చి, “ఆల్బర్టు ఎడ్వర్డు' అని జనులు నన్నుబిలు చుటకుఁ గోరు చున్నాను,

ఎడ్వర్డు తల్లి మరణమున కై మిగుల దుఃఖతుఁ డయ్యును మంత్రులును, ఆయన రాజ్యముల యందలి జనులు చెప్పిన యూఱట పలుకుల వలనను, హృదయరంగము నా క్రమించు కొనిన చింతను దుడిచి నైచి రాజ్యభారమును వహింపఁ బూ నెను వీక్టోరియా మహారాణికిఁ బరలోక క్రియలు సమ స్తరాజ చిహ్నములతోఁ జక్కగ నడిచెను. ఆయమ చుట్టాలందఱును విచ్చేసి యుండిరి. కాని అదేవేరి మనుమడు జర్మని దేశము