పుట:Saptamaidvardu-Charitramu.pdf/149

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

136

సప్త మైడ్వర్డు చరిత్రము.


గ్జాండ్రులు డెనార్కునుండి ఏప్రెలు నేల 20 తేదిని ఇంగ్లండు నకు జనుదెంచిరి. ఎడ్వర్డు, తనయెడల జనులకుఁ గల రాజు భక్తిని దెలుపుచు వ్రాసినందుల కై , అతఁడును వారియుందు గల కూర్మిని నెఱుక పఱచు సమాచారంబులం బంపి వారిని సంతోష పఱచెను.

తొమ్మిదవ అధ్యాయము.

ఎడ్వర్డు రాజ్యమునకు వచ్చి పట్టాభిషిక్తుఁ డగుట.

విక్టోరియా మహారాణి ముసలితనంబున మేనువడంక రాజ్యమును లెస్సగం బాలించు చుండెను. ముసలీ పండు. చెట్టునుండి ఊడిపడ సిద్ధముగ నుండెను. ఇంతలో మృత్యు దేవత అను ఫలాభిలాషి. తన గడ ఆనురోగముతో నాపండునుగోయఁ బూనెను, ఆగడ ఆఫలమును తాకితాకక ముందే నేలమీఁదం బడున ట్లుండె. విక్టోరియా మహా రాణి వ్యాధిచే బీడింపబడు చుండినను, మరణావస్థను సహించుకొని 1901 స. జనవరి నెల "తే 22 వ దిని స్వర్గస్థురాలయ్యె. అప్పు డాదేవేరి పుత్రు లును, పుత్తికలును, పుత్రులును, ప్రహేతులును, ఆమె సమీ పంబుస నుండిరి. ఎడ్వర్డు తల్లిచావున కై దుఃఖించు చుండెను. మంత్రు 'లేతెంచి ఆయన శోకము శాంతింపఁ జేసి రాజ్యభారమును వహింప బ్రోత్సాహపరచిరి