పుట:Saptamaidvardu-Charitramu.pdf/138

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఎనిమిదవయధ్యాయము

125


రాజ కార్యములలో నెంతమాత్రము ప్రవేశింపక ఉండెను. నివసించుటకు ఇండ్లను ఏర్పాటు సేయుటకు నొక కమిషను ఏర్పడెను.

“కమిషన్ " అనఁగా సభ. ఇందు నలుగు రైదుగురుందురు, అయిదు మందికి వాటిలో "నొకఁడు అధ్యక్షుడుగ నుండును. వానికి "ప్రసి డెంటు" అని పేరు. “ప్రసిడెంటు" అను నింగ్లీషు పదమునకు "అధ్యక్షుడు" "ఆధికారి" యజమానుఁడు" "నేత" “ అధిపతి " మున్నగునవి సమూస పదములు,

ఆ సభకు నెడ్వర్డు సభాధ్యక్షుడు. అతఁడు బీదలకు మేలు సేయవలయు ననువార్తను విన్న వెటనే ఆయనచిత్తం బు నాక్రమించుకొనిన శోకము పరారి చిత్తగించెను. దైర్యలక్ష్మి ఆయన యందుఁ జొరబడెను.అతడా బీదలకై మిక్కిలి ప్రీతితో బాటు పడెను. అయినను రాజమంత్రులు ఎడ్వర్డు బీదల యెడ నధి కు ప్రీతినిఁగన బరచుట నొల్లక ఉండిరి. అతఁడు వారిమాటబెడ చెవినిడి తన యిష్టాను సారముగ న్యాయధర్మముల మేర సతిక్ర మింపక బీదలకు సౌఖ్య మొదవఁ జేయుటలో సక్కఱతో గష్ట పడి పనిచేసెను. ఆతడు కూలీల సంఘమునకును, వారు చదు వు బడికిని ఏటేట ద్రవ్య సాహాయ్యము సేయుచుండినాఁడు. అతఁడు తాను ఇంపీరియల్ ఇన్ స్టిట్యూట్" అను విద్యా లయమును స్థాపించి, తనతల్లి సాయంబున దానిని బెంచి,వృద్ధికి దీసికొని వచ్చెను.

ప్రిన్సు జార్జి పెండ్లి

ఎడ్వర్లు పెద్దకొమారుఁడు "పెండ్లీ గాక స్వర్గస్థుఁ డయ్యే: