పుట:Saptamaidvardu-Charitramu.pdf/139

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

126

నప్త మైడ్వర్డు చరిత్రము.


రెండవ కుమారుఁ డాతని వెనుక రాజ్యమునకు రాఁదగినవాడు. ఎడ్వర్డు జార్జికిఁ బెండ్లి సేయఁగోరెను. జార్జి చెక్కు రాజ్యపు రాజపుత్రిక యగు మేరిని వరియింప నెంచెను. ఎడ్వర్డీరహ స్యంబు గ్రహించి వారి రువురకును వివాహము సేయవలయు నని పత్రి కలలో బ్రచురము సేయించెను. అతఁడు తల్లి యగు విక్టోయాతో నాలోచించి 1894 సం. న జూలై నెల 6న తారీ ఖున పెండ్లిమూరుతం బిడెను. వివాహము "సెయింట్ జేమ్సు చేపలున నడిచెను. ఆసమయంబున రుష్యాచక్రవర్తియును, డెన్మా ర్కు రాజును, రాణీయును, ఇంకను పెక్కుమంది. శ్రీమంతు లును, సొమంత ప్రభువులును వచ్చి వధూవరులకుఁ గానుకుల నొసంగిరి. జను లావిహమువలనఁ దమకు దొడ్డ మేలు కలుగు సని కోరిరి.. ఎడ్వర్డు తనకుమారురత్నమునకు విసోహము సేసి, ఆయనను రాచపనులలోఁ బ్రవేశంపఁ జేయఁ బ్రయత్నిం చుండెను.

1894 సం . న ఏప్రిలు నెలలో స్వర్గస్టురాలైన ప్రిన్సస్ అలీ సు యొక్క కుమారునకు ఎడ్వర్థుతండ్రి వంశస్థులలోఁ జేరిన “విక్టో యామెలిటా " అను రాకొమార్తను ఇచ్చి కోబర్గున నడుచు వివాహమునకు ఎడ్వర్లు వెళ్లెను. అవివాహమ సూత్సవ తరుణం బున విక్టోరియా మహారాణి, జర్మనీ చక్రవర్తి మున్నగు గొప్ప ప్రభువులు వచ్చియుండిరి. వధూవరుల నాశీర్వ దించి తమతమ రాష్ట్రములకు నేగిరి. ఎడ్వర్ణావల భార్యాసహితుడై. ఆగస్టు