పుట:Saptamaidvardu-Charitramu.pdf/136

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఎ ని మిద వ య ధ్యాయము,

123


పట్టి యైన క్లారెన్సు ప్రభువు రోగ పీడితుఁ డయ్యె, తల్లిదండ్రులు అతని సమీపంబుననే ఉండి, రాచ కార్యముల నన్నింటిని గమనింపక తమబిడ్డ సేమమే కోరుచు వైద్యులవలన దీవ్యౌ షధముల నిప్పించు చుండిరి. ఆయువు పరిమితి ముగియు కాలము సమీపించి నపుడు, మందులు పనిచేయునే? అతనికి రోగము ముదిరెను. వైద్యులు ఆపసి కూన బ్రతుకఁ డని నిశ్చ యించుకొనిరి. అట్లే ఆతఁ డా నెల 14 వ తేదీని పరలోకగతుఁ డయ్యెను. అతని దేహము సమస్త రాజు చిహ్నములతో సమాధి చేయఁబడెను.

ఎడ్వర్డ లెగ్జాండ్రాల పుత్ర శోకము నార్ప నెవరితరము? దాని యురవడి. "మొదట మొదట దీర్ఘముగను, వాడిగాను, ఉండును. క్రమముగ దాని వాడి మొన, నేలలోని పల్లము క్రమ ముగఁ బూడిపోవు రీతిని మొద్దగు చుండును. ఇంతలో నామరణ వార్త సమస్తరాజ్యములకును వాయు వేగ మనో వేగములు జేరెను. ఆయాచోటుల నుకు గొప్ప వారు. విక్టోరియాకును, ఎక్వర్ణ లెగ్జాండ్రా లకును, ఉపచార వార్తలను బంపిరి. ఎడ్వర్డలె గ్జాండ్రాలు తమ రాజ్యము లయందలి జనులు తమకు పంపిన యూరట పలుకులవలనఁ దమ యుమ్మలికంబు నుపశమనము సేసికొని ఊఱడిల్లిరి..

కాంటెర్బెరి ఆర్చిబిషప్, ఎడ్వర్ణునకు నూఱట వార్త