పుట:Saptamaidvardu-Charitramu.pdf/129

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

116

సప్తమైడ్వెర్డు చరిత్రము


ఖర్చులు పోను 525,000 లు. దానివలన నికరము ఆదాయము తేలెను.

విక్టోరియా మహారాణి గోల్డెన్ జూబ్లీ మహోత్సవము

.

1886 సం. న కలోనియల్ అండ్ ఇండియన్ ఇన్ స్టిట్యూ ట్" (Colonial and Indian Institute) అను పాఠశాలను విక్టోరి చూసుహారాణి గోల్డస్ జూబ్లీ మహోత్సవ సమయంబున నెలకొలుపవలయ నని మేయరు ప్రభువు ఎంచి, తన భావమును ఎడ్వర్డునకుఁ దెలియఁ జేసెను. ఇందులకు గాను గొప్ప వారంద రును చందాలు నేసికొని "పైకమును వసూలు చేసిరి. ఎడ్వర్డిం తకుఁ బూర్వము "కలో నియల్ ఇండియన్ ఎక్జిబిషన్ ” కు గాను మిక్కిలి యక్కరతో పాటు, దానిని నిర్వహించినం దున, ఆయనకుఁ గొన్ని కానుకలిచ్చుటకుఁ గొంత పైకము వసూ లయ్యె. అతఁడు తన కాసొమ్ము అక్కర లేదని చెప్పి, 'దానిని కలోనియల్ ఇండియక్ ఇన్ స్టిట్యూటునకు నిమ్మని వచించెను. రాణిమంత్రు లారొక్క మును ఆ పాఠశాల కై వ్యయము సేసిరి.

ఇంజనీయరు శాస్త్రము నేర్చి, ఆపనిలో నేర్పరులైన వారీ నెడ్వర్డు ఆదరించు చుండెడినారు. కొందరు ఇంజీనియర్లు ““ మర్శీ" అను నదిమీఁద ఒక వం తెసకట్టి, అవంతెన మీద నీటి కాలుపపోవునటులను, వాని క్రింద నేలు ప్రవహించుచుండు లాగున నద్భుత కార్యమును జేసిరి. ఎడ్వర్డు ఆవం తెనపై నెల కొనిన కాలువ తూమును దెఱచి నీటిని పారుదల జేసెను.