పుట:Saptamaidvardu-Charitramu.pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అరవయద్యాయము.

89


ప్రాచీన కాలపు నాగఱికతకుఁ బేరువడసిన రాజ్యములలో నీజిప్టు సుప్రసిద్ధ మైనది. ఆదేశములో ప్రాచీన కాలవు వాస్తుశాస్త్ర ప్రకారము కట్టి శిథిలమైన దేవాలయములును, గోపురములును, ఆ నేకములుండును.ఎడ్వర్ణ లెగ్జాండ్రలు దానిం గాంచుటకు నవి యుండు చోటులయందు:దిగి, వానిని జూచి వాని సొబగునకు మిక్కిలి యాశ్చర్యంబు నొంది అట్టివాని నాదరించిన వారి దాసశౌర్యాది సద్గుణంబుల సభివర్ణించుచు, అట్టివి పలము కాక వానిం గాంచుటకు వచ్చిన బాటసారులకు నానందదాయకములై ఉన్నందులకు మనంబున సంతసము "సెందుచు, తాముండిన యోడకుఁ దిరిగి వచ్చిరి . పిబ్రవరి నెల 20 న తేదీని ఓడలు ఏటి యడుసున దిగబడెను. అవి మరల నీటి పై దేలుటకు సందలి. సామానులు గట్టు పైకి దింపలసియుండెను. ఎడ్వర్డు లెగ్జాండ్రులుసదర్లెండు ప్రభువు నోడ మీదికి వెళ్లి అచ్చట నాహారమును భుజించిరి. ఇంతలో దిగఁబడిన యోడలు నీటీ పై నెప్పటి రీతిని దేలసాగెను, అందఱును బయనము సేయుటకు గడంగిరి,

ఫిబ్రవరి నెలాఖరు వరకు నారాజదంవతులు: సది లోనే ప్రయాణము సేసి, ఆయా చోటల యందుండు వింత ప్రదేశములు జూచి, ఆహ్లాదము: బొరసి, నదీ ముఖ ద్వారము చాయఁ బయ- సము చేయసాగిరి. అప్పు డెడ్వర్లు నష్ట మైన పెన్నిధిని గన్న చందంబున మొక్క. మకరంటు నీటి పైనఁ దేలుచుండుటను జూచి. వెంటనే దానిని గాల్చెను. మొసళ్లు బైటికి రావు. అవి తమ్ము