పుట:Saptamaidvardu-Charitramu.pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

88

సప్తమైడ్వెర్డు చరిత్రము


వంటవాండ్రును, ఒక తురక వంటవాఁడును, వంట సేయుటకు సిద్ధులై ఉండిరి. ఆయోడలో భోజన వస్తువులన్నియు నిండియుం డెను. కోడి పుంజులు, బాతులు, కోడి పెట్టలు, నాని గ్రుడ్లును, లెక్కకు మిక్కిలియై ఉండెను. మూఢవ యోడ కైరోల నుండు బ్రిటిషు కస్సలును, ఈజిప్టు దేశస్థు లిర్వురును, ఫ్రెంచి దేశపు డోబీలును, వచ్చుచుండిరి. దానిలో గుఱ్ఱములును, కం చరగాడిదెలును, జనుదెంచుచుండెను.

ఎడ్యంర్డు వేటలో నధికాసక్తి కలవాడు. అతడు నది కెలంకుల నుండు పక్షి సనూహంబుల నప్పుడప్పుడు కాల్చుచుఁబయనము నొసర్చు చుండె. నైలు నదిలో మొసళ్లు పెక్కులుం డు సను ఖ్యాతిని ఎడ్వర్డింతకుముందనేక పర్యాయములు విని యున్న వాఁ డగుటచే నామొసళ్లలో ఒక దానినైనను జంపి, ఇంగ్లండుసకుఁ గొనిపోవలయునని సర్వవిధములఁ బ్రయత్నం చెను. కాని అతని దృష్టి పదంబున ఒక టి యైనఁ గోచరము కాదయ్యె.

ఒక నాఁటి రాత్రి నా రాజ దంపతు లుండిన యోడలో నలెగ్జాండ్రాకు సమీపంబున నిప్పు రగులుకొనెను. ఎడ్వర్డు మంట పెద్దదగుటకు ముందే మేలుకొని దాని నార్పెను. పగలంతయు నాఫ్రికా దేశపు సూర్యరశ్మికిఁ జక్కగా నెండిన మ్రాని యోడలు నిష్పమంటకుఁ బేలపిండియేకదా ! భగవంతుని కృపాతిశయముచే నొయగ్గిమంట చల్లా రెను.