విజ్ఞానకోశము . ౨ తానునిత్యము వేటాడుజంతువులను పరిసర ప్రదేశములలో లభించురంగురాళ్లతోను(జాజు మొ.నవి), నలుపు రంగుతోను చిత్రించెడివాడు. వాటిని నేటికిని ఫ్రాన్సులోను, స్పెయిన్ లోని అల్తిమీరా(Altmeera) గుహలలోను కాంచవచ్చును. అటులనే భారత భూభాగములో దక్కను ప్రాంతమందు నివసించుచుండిన ఆదిమానవుడొనర్చిన చిత్రణములు రాయ చూరు జిల్లా మొదలగు ప్రాంతములలో కనుగొనబడినవి. కాలక్రమమున మానవుని సభ్యత, సంస్కృతి అభివృద్ధి చెందినవి. వాటికితోడు నివాసయోగ్య గృహనిర్మాణము అభివృద్ధి అయ్యెను. రాతికట్టడములనుండి ఇటుకల కట్టడ ముల వరకు కౌశల్యము అభివృద్ధి అయ్యేను. అటులనే చిత్రములు వేయు భూమికలలోను, వాటికై ఉపయో గించు రంగులలోను మార్పులు ఏర్పడెను. కుడ్యచిత్రమును ఫ్రెస్కో (fresco) అందురు. ఇది యొక ప్రాచీన పద్ధతి. చిత్రము వేయుట కుపయోగించు గోడభాగము భూమికయనబడును. ఈ భూమికలు నాలుగు విధములుగా నున్నవి. (1) రాతిగోడ, (2) ఇటుక గోడ, (8) మట్టిగోడ, (4) సిమెంటుగోడ. గోడలపై నుండు చిత్రములలో ప్రాచీన మానవుడు వ్రాసినవే అధిక సంఖ్యలో కనిపించును. నేరుగా శిలపై చిత్రించిన చిత్రములు గాలివానల ధాటికి ఆగజాలక చెదరిపోవును. గుహలలోని చిత్రములు నేటికినీ నిలచి యున్నవి. దానికి కారణము అవి గాలివానలకు లోనుగాకుండ మరుగున నుండుటయే. చిత్రములు చెడి పోవుటకు కారణములు రాపిడి, పొగ, మంచుదెబ్బ, ఎండ అయి యున్నవి. ఈ భిత్తిచిత్రములు రెండు విధము లుగా నున్నవి : 1. బువళా ఫ్రెస్కో (Buon fresco): తడి యారని భూమిక పై చిత్రము. 2. సక్కో ఫ్రెస్కో (Succo fresco): తడి యారిన భూమిక పై చిత్రము. బువ ఫ్రెస్కో అనునది స్థలము యొక్క తడి ఆరక మునుపే చిత్రించు చిత్రము. ఈ చిత్రములో నుపయో గించు రంగులు భూమికలో నొక భాగమైయుండి నీటికి తట్టుకొని యుండగలవు. ఇవి గోడయున్నంత కాలము భద్రముగా నుండగలవు. 741 కుడ్యచిత్రణము తడిగా నున్న సున్నపు గిలాఖాపై రంగులు నీటితో నైనను లేక సున్నపునీటితో నైనను కలిపి వేయబడును. నీరు ఆవిరియై లేచిపోవును; సున్నము ఇంకిపోవును. ఇట్టి సున్నము రంగును మాసిపోనీయదు. సున్నమునకును, రంగునకును సంధాన మేర్పడును. సున్నము, కార్బొనేట్ ఆఫ్ లైమ్ (carbonate of lime) గా గాలిలో నున్న కార్బాలిక్ ద్రావకము (carbolic acid) చే మారి పోవును. దీనిచే రంగుపదార్థము అతికిపోవును. ఈ పద్ధతి అతి ప్రాచీనమైనది. నాసెస్ రాజభవనములోని చిత్ర ములు ఇట్టి కుడ్యచిత్రములకు గొప్ప ఉదాహరణములుగా తీసికొనదగును. కోడిగ్రుడ్డు సొన, తుమ్మబంక, సరేసు (glue), మైనము అనువాటితో రంగులను కలిపి ఉపయోగించు పద్ధతిని ప్రాచీన ఈజిప్షియనులు, గ్రీకులు, రోమనులు ఎరిగి యుండిరి. పాంవీలోని ఫెస్ట్రోస్ (Pompeian Frescoes) చిత్రణములను గూర్చి అనేక భేదాభిప్రాయములు గలవు. గ్రీకుల పద్ధతికిని, రోమనులు గిలాజను తయారుచేయు పద్ధతికిని గల భేదములను విరోవియస్ (Virovious) అనునతడు విపులముగా విశదీకరించెను. రోమనులు వేసిన గచ్చు (Plaster) అనేక అంగుళముల మందము కలిగి యుండెడిది. అందు మొదట ఇసుక, సున్నము, ఇటుక పొడి వాడి, వాటిపై చివరకు గిలాబ సున్నము, చంద్ర కాంతశిలపొడి (ఇసుక) కలిపి వేనెడివారు. సున్నమును చాలా కాలమువరకు నీటిలో నానబెట్టి, పిదప వడియ బోనియు, దంచియు, కలిపియుంచెడివారు. సున్నమును, చంద్రకాంతశిలపొడియు కలిపి బాగుగా నూరి, నున్నగా గచ్చుచేసి బాగుగా మెరియునట్లు చేసేడి వారు. విరోవియస్ వ్రాతలవలన రంగులను అధికముగా నీటిచే తడిపి తడిగానున్న భూమికపై వాడెడి వారని తెలియుచున్నది. నీటితో కలుపు ఈ పద్దతి కేవలము రంగు భూమికల విషయమున మాత్రమే ఉండెడిదనియు, అసలు చిత్రములపై కాదనియు, మైనపు మిశ్రణముచే గూడ రంగులు వేసెడివారనియు, ప్రొఫెసర్ బర్జర్ (Burger) గారు అభిప్రాయపడుచున్నారు. రోమనులు గోడలపై నుపయోగించెడి మైనమును కాచి వాడు చుండిరి అని విరోవియస్ వ్రాసెను. ప్లినీ (Pliny)
పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/794
Appearance