Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆసియా నృత్యరీతులు 42 సంగ్రహ ఆంధ్ర

మన కళలో మార్పులు ఏర్పడినవి. వారు మాత్రము ప్రాచీనసంప్రదాయములనే, నేటికిని అనుసరించుచున్నారు. అచ్చటచ్చట మార్పులు చేయబడి దేశీయమగుటచే, వారి నృత్యకథ మన నృత్యకళకంటే భిన్నముగా నుండును.

మృత్యుప్రదర్శనము వీరి కళయందు నిషిద్ధము. కావున వీరి నృత్యము లన్నియు సుఖాంతములుగా నుండును. యుద్ధఘట్టముల నభినయించునప్పుడు ఒక ప్రత్యేక పద్ధతిని పిరనుసరింతురు. ఓడిపోవునట్టి జట్టువా రెప్పుడును రంగస్థల మునకు ఎడమప్రక్కను, గెలుపునొందునట్టి జట్టువారు కుడి ప్రక్కను ఉందురు. వీరి ప్రవేశ నిష్క్రమణములు కూడ క్రమ ముగా ఎడమ కుడి ప్రక్కలనుండి జరుగును. ఎడమప్రక్కగా నున్న పాత్రల పరాజయమును ప్రదర్శించునప్పుడు గమ్మే ళనమునకు ఎడమభాగమున నున్న పాటకులు జాలిగొల్పు నట్టి విషాద గీతములను విలంబితలయలో ఆలపించ నారంభింతురు. నర్తకులు తమ నాట్యమందలి గభీరతను తగ్గించి, కరుణారస మొప్పించుటకై విలంబితమై, మృదు పైన అంగచలనమును ప్రదర్శింతురు. నాట్య ప్రదర్శనము నందు ఒకేనర్తకి లేక నర్తకుడు రంగస్థలము పై ఎన్నిసార్లు ప్రవేశించినను, నిష్క్రమించినను, ప్రతిప్రవేశమునందును నిష్క్రమణమునందును ప్రేక్షకులకు నమస్కరించుచునే యుండును. ఇది వారి ఆచారమునందలి ప్రత్యేకత. అంతియేగాదు. నృత్యపద్ధతిలో రమణీయముగా నమస్కా రముచేయుట కూడ బలిద్వీపనర్తకుల సొమ్మనవచ్చును.

బలిద్వీప నాట్యములలో విదూషక పాత్రమునకు ప్రాముఖ్యము కలదు. విదూషకుడు లేని నాటకము వారికి అసంపూర్ణముగా భాసించును. మన సంస్కృత నాటకములందువ లే వారి నాటకములందును వర్ణక్రమము ననుసరించి పాత్రములుండును. విదూషకుడు ముఖ్యముగ హాస్యరసమును పోషించు పాత్రముగాన అతని అభినయము ప్రదర్శన నియమములకు కట్టుబడి యుండదు. విదూష కుడు నాటకములోని గంభీరతను తగ్గించి వినోదమును గలిగించునట్టి పాత్ర, జావాలో నాటకమునందలి సూత్ర ఛారుడు శివస్వరూపుడుగా నెంచబడును. శివుడు (నట రాజు) సృష్టి యొక్క లయకర్తయగుటచే ప్రాధాన్యము కలవాడు. అట్లే నాటకమునందు ప్రధానుడగు సూత్ర ధారుని వారు శివస్వరూపునిగా భావించుదురు.

బలిద్వీపములోని దేవదాసీలు ప్రత్యేకముగా పేర్కొన దగిన నట్టువరాండ్రు. వీరు నృత్య గీతములతో భగవంతుని ఆరాధించు భక్తురాండ్రు. వీరి జీవితములు పవిత్రము లైనవి. పవిత్రముగా జీవితములు గడుపగల్గినంత కాల మే వీరు ఆలయమున స్వామి పాదముల వద్ద నుంచబడు బంగారు కిరీటములను ధరించి నాట్యమాడుదురు. మనస్సు ఆధ్యాత్మిక దృష్టినుండి మరలిననాటినుండి నాట్యమును మానివేయుదురు. వీరు భక్త్యావేశముతో నాట్యము చేయు నపుడు ప్రేక్షకులు భక్త్యావేశపరవశు అగుదురు.

సింహళద్వీస నృత్యములు : ఈ నృత్యకళ చాలవరకు తమిళ దేశపు కళ యొక్క అనుకరణముగా నుండును. సింహళ ద్వీప శాస్త్రీయ నృత్యకళకు 'కండియన్' నృత్యమని పేరు. మనదేశమందు కూచిపూడి నృత్యము, తంజావూరు నృత్యము, మణిపుర నృత్యము అని ఇట్లు ఆయా ప్రాంతముల పేర్లతో దేశీయ కళలు పిలువబడినట్లు, వీరి కళ - కండియన్ నృత్యమని పిలువబడుచున్నది. ఈ సృత్య కళయందలి హస్త పాద విన్యాసములు, ప్రదర్శన క్రమ ములు అన్నియు తంజావూరు నృత్యకళా పద్ధతిని చాల వరకు పోలియుండును. వీరు నాట్యాచార్యుని కూడ 'నట్టువ' అని పిలుతురు. వీరు ప్రదర్శించెడు 'కుత్తు' నాటకములందు ప్రాచీన తమిళ పద్ధతిలో రాగములను పాడుదురు. తమిళ, సింహళ, మణిప్రవాళములందు నర్తకులు మాట్లాడుచు, నాట్యమాడుచు రంగస్థల ప్రవేశ నిష్క్రమణముల నొనర్తురు. మన భాగవతములందు వలెనే ఈ నాట్యములందును పురుషులు పాల్గొందురు. కాని వీరి నృత్యమందు ప్రత్యేకముగా పాడువారుండరు. నర్తకులే పాడుచు నాట్యమాడుదురు. మార్దంగికుడు మాత్రము నర్తకులనృత్యము ననుసరించును. సింహళీయులు చేయు కొన్ని నృత్యములు నాట్య సమయములందు సర్తకులు తమ చేతులందు ధరించు అస్త్ర శస్త్రముల పేర్లు గలవిగా నుండును. అట్టివే 'పన్రు' - 'ఉడక్కి' అను నృత్యములు. పన్ తేరునందు - నర్తకులు చేతులతో తాళములు లేదా తంబురలు పట్టుకొని నృత్య మొనర్తురు. ఉడక్కి నాట్యమందు చిన్న చిన్న మృదంగములను నర్తకులు లయబద్ధముగా వాయించుచు నృత్యము ప్రదర్శింతురు.