Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

విజ్ఞానకోశము - 2 41 ఆసియా నృత్యరీతులు


కంబోడియా దేశములోని నృత్యకళ కంబోడియా దేశస్థుల నృత్యరీతులకును భారతీయుల నృత్యరీతులకును చాల సన్నిహిత సంబంధమున్నది. వీరి పూజావిధానములు, ఆరాధనరీతులు భారతీయ సంప్రదాయముల ననుసరించు చున్నవి. వీరు రామాయణ, మహాభారత, భాగవత కథలను నృత్య మాడుదురు. ఏక పాత్ర నృత్యములు, ద్వంద్వనృత్యములు, బృంద నృత్యములు - ఇట్లు వీరి నృశ్యములు పెక్కురీతుల నున్నవి. భరతనృత్యమునందు వలె వీరు రసాభినయమును కొంతవరకు ప్రదర్శించేదరు. వీరి అభ్యాసపద్ధతులు, అంగవిన్యాసములు, లయతాళ విన్యాసములు చాలవరకు భరతశాస్త్ర సమ్మతములుగా నుండును. దేవకన్యా నృత్యము, కిన్నెర నృత్యము, హనుమన్నృత్యము, దాసనృత్యము, మంచనృత్యము - ఇవి వీరికి ముఖ్యమైన నృత్యములు. మనకు భరతనాట్యము, కథక్ మొదలైన సంప్రదాయము లున్నట్లే పూర్వోక్త నృత్యములందును ప్రత్యేక కరణములు, తాళగతులు, అంగవిన్యాసములు, హస్తాభినయములు భ్రమరవిన్యాసములు, చారీహ స్తములు కలవు. ఆ శా. స్త్రీయసంప్రదాయములను అనుసరించియే వీరు ఆనృత్యములందు శిక్షణ పొందుదురు.

బలి, జావా ద్వీపములందలి నృత్యకళ : ఆగ్నేయఆసియా నృత్యరీతు అన్నింటిలో బలిద్వీపపు నృత్యరీతులు ప్రఖ్యాతి నొందినట్టివి. బలిద్వీపవాసు లందరును హిందువులే. మరి యొక విశేష మేమనగా ఆంధ్రులకును ఆ దేశ ప్రజలకును చాల సన్నిహితత్వము కనబడుచున్నది. అందుచే వారు ప్రద ర్శించు నాటకముల ఇతివృత్తములు కూడ రామాయణ మహాభారతకథలనుండి గ్రహింపబడినవే.

ఈ ప్రాంతమునందలి ప్రజల నృత్య నాటకముల భాషకు 'కవి' అని పేరు. ఈ 'కవి' అను భాషకును, నేటికాలములో ప్రజలు మాట్లాడు భాషకును విశేష భేద మున్నది. 'కవి' యందు సంస్కృత పదజాలము మెండుగా నుండును. వీరి నాట్యకళ ఆదర్శ ప్రాచీన భారతీయ నృత్య సంప్రదాయ ములపై ఆధారపడి పెంపొందినట్టిది. రామాయణ, మహాభారత, భాగవత గాథలు గీతములుగా రచింపబడి, తాళలయల ననుసరించి 'గమ్మేళన' సంగీతముయొక్క సహాయముతో ప్రదర్శింపబడును. అర్జునుడు వారి ఆదర్శ పురుషుడు. అవతారమూర్తి యగు శ్రీకృష్ణ భగవానుడు హిందువులలో విశేషముగా వైష్ణవులకు ఆరాధ్యుడై నట్లు ఈ ప్రాంత ప్రజలకు అర్జును డారాధ్యుడు. కనుక నే మనకు కృష్ణరహితముగా రసాభినయము లేనట్లు, అర్జున రహిత ముగా నృత్య నాటకము వీరికిని లేదు. మన పురాణేతి హాసగాథలనే వీరు నృత్యముతో ప్రదర్శించినను, తమ దేశ సంప్రదాయములను అభిరుచులను అనుసరించి వీరు పెక్కు మార్పులను మూలమునందు చేసి ప్రదర్శింతురు. నృత్యమందలి హస్తాభినయము ద్వివిధము. వీరి

(1) గమ్మేళనము : ఇది వీరు పాడునట్టి పాట యొక్క అర్థమును తెల్సునట్టి ముద్రాభినయము. ఇది క భాగమనము ననుసరించియుండును.

(2) సహజము : ఇది కథలోని భావము ననుసరించి, గమ్మేళన సంగీతమునకు అనుగుణముగ ప్రదర్శింపబడు అంగవిన్యాసము.

గమ్మేళనము వీరి నృత్యములందు ప్రాముఖ్యమును వహించును. కథను నడుపునపుడు ఆయా ఘట్టముల ననుస రించి రసభావములను పోషించుచు వారు గానము చేయుదురు, మన నృత్యములందువలె వీరి నృత్యములందు గూడ కొన్ని వేళలందు నర్తకులు పొడుచు నృత్యము చేసినను, వారి గానమునకును, నృత్యమందు వారు ప్రదర్శించెడు వ భావములకును సన్నిహితత్వ మంతగాక నిపించదు. నడుము నకు బిగించికట్టిన సుంద ర మైన దట్టి యొక్క పొడుగైన కొన లను చేతులతోపట్టుకొని, వాటిని గాలిలో ఎగురవేయుచు వివిధగతులలో కదలించుచు నృత్యమాడుట వీరి యొక్క విశిష్టత. వీరి నృత్యము లన్నియు విలంబితలయలో నుండును. యుద్ధనృత్యమందుమాత్రము వీరు లయను పెంచి ఉద్దత పద్ధతిని అవలంబించి నృత్తమాడుదురు.

వీరి నృత్యకళయు, బొమ్మలాటయు, తోలుబొమ్మల భాగవతముల ననుసరించి అభివృద్ధి చెందినట్టివని ఈ దేశ ములో పండితుల యొక్కయు, శాస్త్రకారుల యొక్క యు అభిప్రాయము. ఈ తోలుబొమ్మల భాగవతము ప్రథమ ములో ఆంధ్రదేశమునుండియే ఈ ప్రాంతములకు ప్రాకిన దని చరిత్రకారుల అభిప్రాయము. కనుకనే ఆంధ్ర దేశ స్థ నృత్యకళకును ఈ ప్రాంతీయుల నృత్యకళకును అత్యంత సన్నిహితత్వము కనబడును. దేశకాల పరిస్థితుల ననుసరించి