Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

విజ్ఞానకోశము = 2 39 ఆసియా నృత్యరీతులు

మనము ప్రధానములుగా తలంచెదమో, అవి వారి కళ యందు కనబడవు. కొన్ని ప్రాంతములందు అశాస్త్రీయ మను భావమునుబట్టి రసాభినయము విడనాడబడినది. వారిట్టి అభిప్రాయము కలిగి యుండుటచే వారి ప్రదర్శనములు భావహీనములైన నృత్త నృత్యములతో ముగియు చుండును, జపాను దేశమునందలి 'గెయిషా' అను నాట్యమునందు కొంతవరకు భావప్రకటనమున్నది. కాని అది ప్రేక్షకులను వినోదపరచుటకు చేయబడు భావప్రకటనమేగాని సాత్విక సంచారుల ప్రకటనముతోగూడిన శాస్త్రీయాభినయము కాదు.

తాండవలాస్యములు : సింహళద్వీపములోని కండియను సర్తకులు ప్రదర్శించేడు నాట్యరీతులు పూర్తిగా తాండవ పద్ధతికి చెందినట్టివి, 'కథకళి' లోని గంభీరత వీరి నృత్యము లందు కాంచనగును. వీరు హస్తములను పట్టుతీరు, విన్యా సము, అడవులను ప్రదర్శించుతీరు, ముగింపు, ప్రారంభ క్రమము - సర్వము కథకళియందు వలెనే యుండును. లామాల నృత్యములు, చైనీయుల శాస్త్రీయనృత్యములు తాండవపద్ధతికి చెందినట్టివే. కంబోడియా, జావా, బలి ప్రాంతములలో 'శుద్ధలాస్యము శుద్ధతాండవము ప్రత్యేక ముగా ప్రదర్శించు నృత్యరీతులు కొన్ని కలవు. ఇట్టి సంప్రదాయములు మన దేశమందు అరుదుగా నున్నవి. శుద్ధలాస్యము ప్రత్యేకముగా జావాలో దర్బారు నృత్య మగు 'సిరియంపి' యందు కాంచనగును.

వివరములు : టిబెట్టుదేశ నృత్యరీతులు-టిబెట్టు దేశీయు లకు మంత్రతంత్రములందును, భూత ప్రేతపిశాచములందును విశ్వాసము మెండు. అందుచే వీరు చేయు నృత్యము లన్నియు ఆరాధన నృత్యరీతులై, ఆ క్షుద్రదేవతలను, మహాపురుషులను సంతృప్తి పరచుటకై ఉపయోగపడు చున్నవి. వీరు నృత్యమాడునపుడు ముఖములకు తొడుగులను ధరింతురు. సుమారు పది అడుగుల పొడవుకల బాకా వాద్యములు, గంటలు, డోళ్ళవంటి గంభీర నాదముల నొనర్చు చర్మవాద్యములు వీరి నృత్యములందు ఉపయోగింపబడును. గానము ప్రత్యేకముగా వీరి నృత్యములందు కనిపించదు. కాని నృత్యములకు పూర్వమందును, అంత మందును మతసంబంధమైన మంత్రములు లామాలచే పఠింపబడును. అటుపై వాద్యముల ఆలాపములో నృత్యములు ప్రారంభింపబడును. వీరి నృత్యకళ మళముతో సంబంధము కలదగుటచే కేవలము సుందరసుకుమారము లైన అంగవిన్యాసములు లేనిదై అటవీకుల నృత్యకళను పోలియుండును.

చైనాదేశ నృత్యకళ: వీరి కళకును, టిబెట్టీయుల కళ కును పెక్కు పోలికలున్నవి. ఉభయదేశీయుల నృత్యము లును మతసంబంధముకలవే. ఉభయదేశీయులను బుద్ధ దేవునికి భక్తులే. అందుచే వీరి నృత్యములు ఒకేరీతిగా నుండును. కానీ చైనీయుల వినోద నృత్యములు భర శాస్త్రమునందలి వికట, విషము రీతులను పోలియుండును. భీతినిగొల్పు హాస్యమును బుట్టించు రంగురంగుల ఆభరణ ములను, వస్త్రములను ముఖములకు తొడుగులను ధరించి, కసరత్తులందువలె మొగ్గలు వేయుచు, గాలిలోనికి ఎగురుచు, భూమిపై గొబ్బున పడుచు, త్వరితగతిని పరుగులిడుచు.... ఒక కాలు గాలిలోనికి విసరి, భూమిపై రెండవకాలు మోపి, గిఱ్ఱున తిరుగుచు వెక్కు చిత్రవిచిత్రమైన సోము లను ప్రదర్శించుచు వారు నృత్యమాడుదురు. ఇట్టి రీతులన్నియు భరతశాస్త్రములో నున్నవి. ఇవన్నియు మన నర్తకులు - నృత్యకళాఖ్యాస దశలో తమ శరీరావయవములను నృత్యకళకు అనుగుణములుగా చేసికొనుటకై అభ్యసింతురు. ప్రదర్శనములందు వీటిలో కొన్ని మాత్రమే ప్రయోగింపబడును. సాముగరిడీలందును, దొమ్మరివారు ప్రదర్శించెడు ఇట్టి విద్యయందును ఇట్టి అంగవిన్యాసముల నెక్కువగా జూచెదము. అభినయము వీరి కళయందు లేదు. అంగీకాభినయ ప్రధానములయిన నృత్యనృత్తములే ఓరి కళలో విశిష్టములైనవి. జపాను దేశీయుల కళ చాలవరకు ప్రాచీన సంప్రదాయములను విడనాడి - పాశ్చాత్య సంప్రదాయములను అలవరచుకోని నది 'గెయిషా' నర్తకులు కొంతవరకు అభినయవిద్య నభివృద్ధిపరచిరి. వీరు పాటపాడుచు అభినయించెడు విధానమును అభ్యాసము చేయుదురు. 'గెయిషా' నృత్యములు లాస్యపద్ధతికి చెందినట్టివి. జపానీయులు నృత్య రీతులలో రంగాలంకరణ విషయమున ప్రత్యేకశ్రద్ధను వహించెదరు. వీరి నృత్యము రెండువిధముల నున్నవి. (1) కథననుసరించి చేయబడునట్టిది (2) ఒక ప్రత్యేక గీతమునందలి హావభావములను ప్రదర్శించునట్టిది :