Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆసియా నృత్యరీతులు

సంగ్రహ ఆంధ్ర

లను పోల్చవచ్చును. వీరు పల్లెలందు పట్టణములందు జట్టులుగా తిరుగుచు నృత్య ప్రదర్శనములను కావింతురు. సాధారణముగా పురాణ గాథలను వీరు నృత్యముచే ప్రదర్శింతురు. ఈ నృత్యరీతు లందరికిని అందుబాటులో నుండునట్టివి.

తూర్పుదేశము లండలి నృత్యకళపై భారతీయ సంప్రదాయము యొక్క ప్రభావ మధికముగా నున్నను, వీరు తమ జాతీయభావముల ననుసరించి, తమ కళ కొక ప్రత్యేకత నేర్పరచుకొన్నారు. ఆంధ్ర, తమిళ, కేరళ, వంగదేశముల నృత్యకళ వీరియొక్క నృత్యముల కాధార మైనట్లు తొచును. ముఖ్యముగా ఈ దేశీయులు ప్రదర్శించెడు 'వాయంగ్ ' అను తోలుబొమ్మలాట ఆంధ్రదేశమునుండి వెడలిన విద్యయేనట. వీరి నృత్యకళ ఆంధ్రుల భాగవత కళ యొక్క అనుకరణమేమైనను, ఆంధ్ర నర్తకులవలె సాధారణముగా వీరు నాట్యమాడునపుడు సంగీతము పాడుచు అభినయించరు. కథ నడుపు విధానము 'కథకళి' ని పోలినను ముద్రాభినయము, రసాభినయము మాత్రము కొంతవరకు “మణిపురి' ని పోలియుండును. నాట్యమాడు నప్పుడు వీరు ముఖముతో హావభావములను ప్రదర్శింపరు. శాస్త్రీయ నాట్యమందు అట్లు రసాభినయము ప్రదర్శించుట తగదనియు, కేవల రసాభినయవిశిష్టమైన నాట్యము నీచ నాట్యమనియు కొన్ని సంప్రదాయముల వారి అభిప్రాయము. ఆహార్యము అజంతా గుహలలోని అలంకరణమునకు అనుకరణముగా మండును. కొన్ని నృత్యములందు వీరు ముఖములకు తొడుగులను ధరించు చున్నారు. వీరికి నృత్యములందు సహకరించెడు వాద్య, సంగీత బృందమునకు 'గమ్మేళనము' అని వేరు. సాధారణముగా గమ్మేళనమే వీరి నృత్య కథను నడుపు చుండును. పాడబడుచున్న పాట ననుసరించియు, మ్రోగుచున్న వాద్యముల సంగీతము ననుసరించియు నాట్యమును నర్తకులు ప్రదర్శించు ఆచారము కలదు.

వీరి నాట్యకళయందలి నృత్య, నృత్త, అభినయములనుగూర్చిన వివరములు :

నాట్యము  : రామనాటకము, మహాభారతము మొదలైన భారతీయ పురాణకథలను వీరు నృత్యనాటకములుగా ప్రదర్శింతురు. ఇందు ఆయా గాథల ననుసరించి అనేక పాత్రధారులు రంగస్థలమున ప్రవేశించి నాట్య మాడుదురు. వీరు నాటకములను నడుపు పద్ధతి మన పురాతన సంస్కృత నాటకములను నడుపు పద్ధతిని పోలియుండును. మన నాంది, భరతవాక్యము, నటి సూత్రధారుల ప్రవేశము మొదలయిన పద్ధతులన్నియు వీరి నృత్యములందు కాననగును. మరియు భాగవతములందువలె ఒక హాస్యగానిపాత్రనుగూడ వీరు నాట్యములందు ప్రవేశ పెట్టుదురు. ఆ పాత్రప్రవేశము కథాప్రవృత్తికివి కథా రామణీయకమునకును తోడ్పడును.

నృత్యము : మన నాట్యరీతులందువలె పశుపక్ష్యాదులను, నదులను, దేవతలు మొదలయినవారిని చూపుటకు వివిధములైన హస్తములు వీరికి లేవు. పదార్థాభినయము, విశేషాభినయము వీరికంతగా తెలియవు. అనుకరణమును గూడ కొంతవరకుమాత్రమే వీరు ప్రదర్శింపగలుగుదురు. వీరి ముద్రలు సహజములు. మణిపుర నృత్యములందువలె వీరినృత్యములందు అల్పసంఖ్యాకములయిన ముద్రలున్నవి. లయతోగూడిన అంగవిన్యాసము మాత్రము వీరు చక్కగా• ప్రదర్శింపగలరు. భరతశాస్త్రములోని శాస్త్రీయానుకరణములు - సర్పిత, నాగాపసర్పిత. విద్యుద్బ్రాంత, భ్రమర, ఏక పాద భ్రమరాదులు తరచు వీరి నృత్యములందు కాననగును. నృత్యనాటకములందు, దేవతా పాత్రానుకరణ – నృత్యములతోబాటు - లేడి, వానరము, మొదలగు జంతుపుల యొక్కయు, మయూరము, కోకిల మొదలైన పక్షుల యొక్కయు అనుకరణ నృత్యముగూడ వీరు ప్రదర్శింప నేర్తురు. అట్టి సమయములందు వీరి ఆహార్యము ఆయా జంతువుల రూపానుగుణముగ నుండును.

నృత్తము  : వీరి నాట్యకళయంతయు వృత్తప్రధానమైనది. లయ, తాళములతో గూడిన అంగవిన్యాసమును ముఖ్యముగా వీ రారాధింతురు. వికట, విషమ, సృత్తరీతులను వీరు ప్రత్యేకముగా శ్రద్ధవహించి అభ్యసించి ప్రదర్శింతురు. లఘువిధానము వీరి నృత్యమందు మచ్చునకయినను కానము.

అభినయము  : ఈ దేశముల నృత్యము అన్నింటికిని భరతశాస్త్రమే ఆధారమైనను వాటి విషయమున మన కును వారికిని ఒక ముఖ్యమైసభేదము కనబడుచున్నది. అదేమనగా - ఏ భావాభినయమును రసాభినయమును,