Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అర్ధ వ్యవసాయపద్ధతి మంత్రార్థము : ఓరుగ్ధుడా, నీ రోగోపశమనమునకై ఎడ్లతో గూడుకొనిన నాగళ్ళకోరకు నమస్కారము. ఆ నాగలికి అవయవములగు (నాగలి భాగములగు) ఈషా, యుగములకొరకు అనగా ఏడేకఱ్ఱ, కాండ్ల కొరకు నమస్కా రము. (ఇట్టి మంత్రముచే అభిమంత్రణము చేయవలెను.) అయితే నాగళ్ళు, నాగలి భాగములగు ఏడెకఱ్ఱలు, కాండ్లు, అచేతనములు గదా ! వీటికి నమస్కార మెట్లు సంగతమగును? అని శంకింపరాదు. శ్రీ వ్యాసప్రణీతమగు ఉత్తర మీమాంసా శాస్త్రములో "అభిమాని వ్యపదేశస్తు విశేషానుగతిఖ్యామ్" (ఉ. మీ. అ. 2.1-5) అను సూత్ర ముచే అచేతన పదార్థములందు గూడ తదభినూనియగు దేవత ఉండునని సిద్ధాంతీకరింపబడుటచే ప్రకృతములో నాగలి అభిమాని దేవతలకును నాగలి భాగములగు ఈషా, యుగాభిమాని దేవతలకును నమస్కారము గాన, విరోధ ప్రసక్తి లేదు. మరియు, ఎడ్లు దున్నగా ఫలించిన ధాన్యమును గూర్చి కృష్ణయజు ర్వేదములో "ఆగ్నావైష్ణవం మృతే చరుం నిర్వ పేచ్చకుష్కామః"అను ఉపక్రమణముతో “ధేవ్వైవా ఏతద్రేతో యదాజ్య మనడు హ స్తండులా మిథునా దేవాస్మై చడు। ప్రజనయతి" అని కలదు. (కృ. య, 8. కా. 2–9 అను.) ఇచ్చట నేత్రరోగములు ఉపశాంతములై దృష్టిపాట వము కావలెనని కోరువాడు అగ్ని, విష్ణువు, ఉభయులు దేవతలుగా గల ‘ఆన్నా వైష్ణ వేష్టి' అను కర్మను చేయవలసి నదిగా ఈ శ్రుతి విధించుచు, ఆకర్మలో ఎద్దుచే దున్ని పండించిన ధాన్యము దంపగా వచ్చిన బియ్యమును అవు నేతితో వండి ఆ అన్నమును ప్రధాన దేవతలకు హోమము చేయవలసిన హోమద్రవ్యముగా విధించి, ఆ అన్న నిష్పత్తికి మూలములగు ఆజ్యమునకు, తండులములకు ఉత్పాదకము లగు గోవును, వృషభమును మిథునముగా వర్ణించి, అట్టి మిథునము వలన నిష్పన్నమయిన ఆజ్యమును, బియ్యమును గోవృషభముల రేతస్సుగా వర్ణించి, ఆ రెండు రేతస్సుల యొక సమ్మేళనరూపమగుహోమద్రవ్యము యొక్క హోమ ప్రభావముచే చతుస్సులు ఉత్పన్నమగు నని వర్ణించినది. అనగా లోకములో (స్త్రీ, పురుష రూపనగు మిథునము యొక్క రెండు రేతస్సుల కలియకచే. సంతానము జనించి సంగ్రహ ఆంధ్ర ఆజ్య నట్లు ఇక్కడ గోవృషథరూపమగు మిథునములో రూపమగు గోరేతస్సునందు (ఎద్దు దున్నుటచే జనించినవి కావున) తండుల రూపముగు వృషభ రేతస్సును ఉంచుటచే ఉభయ రేతస్స మ్మేళనద్వారమున ప్రశ స్తమయిన చతుస్సు ఉత్పన్నమగు నని తాత్పర్యము. దీనివలన చతురోగములను పారద్రోలి మంచి దృష్టిని చేకూర్చెడి శ్రోతకర్మలో ఎద్దుదున్నిన ధాన్యమువలస నై స బియ్యమును ప్రధాన హోమద్రవ్యముగ శ్రుతి చెప్పుటచే ఎద్దు దున్నుటలో విశేషమున్నట్లు స్పష్టమగుచున్నది. ఎంత లోతుగ దున్నవలెను అను విషయమును గూర్చి ఇట్లు చెప్పబడినది: "దర్శపూర్ణమా సేష్టులు"అను శ్రాతకర్మను చేయుటకు వేదిని నిర్మించదలచిన స్థలమందలి ఓషధులను త్రవ్వి, అచ్చట వేదిని ఏర్పరుపవలెననియు, “చతురంగులం ఖియా । చతు రంగులం ఖనతి | చతురంగులే హ్యోషధయః ప్రతితిష్ఠంతి" (కృ.య. బ్రా. 82-9) (ఓషధులు 4 అంగుళములలో తున ప్రతిష్ఠితములయి ఉండును గాన 4 అం. ల లోతు త్రవ్వవలెను.) అనియు సహేతుకముగా చెప్పబడినది. ఫలితము : ఇంతవరకు చూపబడిన శ్రుతి యుక్త్యను భవములచే దున్నుట కే కాక, అలక్ష్మిని తొలగించి, అన్న మిచ్చుటకును, కుల క్రమాగతములయి అనివార్యములగు మహావ్యాధుల యొక్క ఉపశమనమునకును, చడూరోగ నివృత్తి ద్వారమున దృష్టి పాటవము మున్నగు అనేక శ్రేయస్సులకును శాస్త్రసిద్ధమయిన ఎడ్లతో కూడిన నాగళ్ళు సాధనము లని వేదములు బోధించుచున్నవి. పంటలు :- మహాగ్నిచయనమను క్రతువులో ఉఖ ఆను ఒక చతురస్రమును (అనగా నలుపలుకలు, జానెడు ఎత్తు గల వంటకుండను) మంత్రముల నుచ్చరించుచు సిద్ధము చేసి, మంత్ర పాఠముతోనే కాల్చవలెను. దానిని కాల్చు నపుడు పఠించవలసిన మంత్రములలో “వరూశ్రయస్త్వా. పచంతూఖే - జనయ స్వా దేవీః - పచంతూఖే" (కృ. య. సం. 4-1-4) అను మంత్రమునందు రెండుసార్లు 'పచంతు' అను శబ్ద ముండుటచేతను కృష్ణ యజుర్వేదములో "ద్విః పంత్విత్యాహ తస్మాద్ద్వి స్సంవత్సరస్య సస్యం వచ్యతే” (5 1-7) అనుదానియందు వఛంతు, అను పదమును రెండు మంత్రములలో రెండుసార్లు ఉచ్చరించుటచేతను లోక S