Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

విజ్ఞానకోశము = . కనుకనే, సర్వకర్మలందు యవల కే వినియోగము కనిపించు చున్నది. ఇంకను ప్రథమములో యవధాన్యము, అనంత రము ఇతరధాన్యములు సంప్రాప్తమయినట్లు కూడ కనిపించుచున్నది. తగినవాడని ఈమంత్రములవలన దున్ను వాడు గాక దున్నించువాడే “వ్యవసాయకుడు" అనెడు బిరుదమునకు స్పష్టమగుచున్నది. దున్నించుచుండెడి ఇంద్రుడు సీరపతి, వ్యవసాయకుడు. దున్నుచుండెడి మరుద్గణము కూలి హెండ్రు మాత్రమే అగుదురు. వ్యవసాయకులు గారు. ఇదేవిధముగ లోకములో కూడ "పంచభిః హలైః గ్రామణీః గ్రామం కర్షతి" అనగా, గ్రామాధికారి అయిదు నాగళ్ళచే గ్రామమును దున్నుచున్నాడు అను వ్యవహారము కలదు. అచ్చటకూడ ఒక మనుష్యుడు లీ నాగళ్ళచే ఒకేసారి దున్నుట శక్యముకాదు. కావున అయిదుగురిచే దున్నించు చున్నాడు అని అర్థమును గ్రహింపక తీరదు. అయిదుగురు దున్నినను, (గ్రామణిః-కర్షతి) గ్రామాధికారియే దున్ను చున్నాడు అనగా వ్యవసాయమును చేయుచున్నాడు, అను వ్యవహారముచే దున్ను వాండ్రు కూలివాండ్రే గాని వ్యవసాయకులు కారు అని స్పష్టముగ తెలియుచున్నది. ప్రదర్శితశ్రుతిసూత్రములవలన 12 కాండ్లు గల ఒక నాగలిచేతనే, 24 ఎడ్లతో ఒకేసారి దున్నెడి సౌకర్య మున్నట్టు తెలియవచ్చుటచే ఆధునిక వ్యవసాయ శాస్త్రజ్ఞుల నవీన యంత్రములు అభూత పూర్వవి శేషములను బోధించు నవి కావని బోధపడుచున్నది. “ఇంక ఈ శాస్త్రజ్ఞుల రెండవ సౌకర్యము (ఎడ్లకు శ్రమ లేకపోవుట) ను గూర్చి విచారింతము. ప్రకృత వ్యవసాయ శాస్త్రజ్ఞుల దృష్టికోణానుసారము ఈ ఎడ్లవలన పొందదగిన ఉపయోగము మన దృష్టికి గోచ రించెడి భూమిని దున్నుట ఒక్కటియే అయినచో వాటికి శ్రమ కలుగకుండ ఆ పనిని యంత్రసహాయముచే చేయించుట యు క్తము. కాని, దీనినే గాక మన దృష్టికిని, మన ఊహల కుమ అతీతము అయినట్టియు, వేదైక సమధిగమ్యము అయినట్టియు అనేకములగు ఉపయోగములను అథర్వ వేదము ఉదోషించుచున్నది. అధర్వ వేదములో కృషి ప్రకరణములో ఈ ఎడ్లు చేయు పనిని గూర్చి అచ్చటి మంత్ర మిట్లు చెప్పుచున్నది. . 7 ఆర్ష వ్యవసాయపద్ధతి “పద్భిస్సేది నువక్రామ న్ని రాం జంఘాభిర్భుదన్ క్రమేణా నడ్వాన్ కీలాలం కీనాశస్యాభిగచ్ఛతః" (అ.కా. 4 అను 8 ; 500. 10.) దీని భావము : అథర్వ వేదములో పూర్వమంత్ర ద్వయములో 'ప్రజాపతి' ఎద్దు యొక్క శరీరమందు ప్రవేశించి, దానికి సామర్థ్యము నిచ్చి దృఢముగా చేయు చున్నాడు. కాన అనడ్వాహము (ఎద్దు) ప్రజాపతి రూప

  • మయినది. దీనివలన వ్రీహియవాది ధాన్యములు నిష్పన్న

ములగుచున్నవి అని చెప్పి, ప్రకృత మంత్రములో 'ప్రజా పతి రూపమగు ఎద్దు దున్నునపుడు తన నాల్గు పాదముల చేతను నాళ హేతువగు అలక్ష్మిని అధోముఖముగ అణచి, దున్నుచున్న భూమిని పిక్కల చేత కర్షణముచే చీల్చుచు వ్యవసాయకునకు అన్నము నిచ్చుచున్నది' అని చెప్పబడు చున్నది. ఇవ్విధముగ 'దున్నెడి ఎద్దు నాల్గు పాదములచే దారిద్య్ర హేతువగు అలక్ష్మిని అణగద్రొక్కుచు ప్రజాపతి లబ్ధమగు సామర్థ్యముతో పిక్కబలముచే భూమిని దున్ని కర్షకునకు అన్నమును ఇచ్చుచున్నట్లు అథర్వవేదీయ మంత్రము బోధించుచున్నది. ఇంకొక గొప్ప ఆశ్చర్యజనకమగు అపూర్వ విషయము ఎడ్లతో గూడుకొనిన నాగలికి సంబంధించినది అధర్వవేద ములో బోధింపబడుచున్నది. P “నమ స్తే లాంగలేభ్యో నమ ఈషాయు గేభ్యః" (అ. వే. శా, 2, సూ, 5. 4. మం.) దీనికి విద్యారణ్యభాష్యము : "హేరుణ్ణవే త్వద్రోగోప శమనాయ లాంగలేభ్యః, వృషభ యుక్త సీ రేభ్యః నమః | ఈషాయు గేభ్యః ఈషాళ్చ యుగాని చతేథ్యశ్చ హలావయవేభ్యః నమః | ఉభయత్రాపి పూజా యాం బహువచనం వీడాక రరోగ నివర్తక త్వేన పూజ్యత్వం ఆరోప్య నమస్కారః కృతః | యద్వా హలాదీనాం అచేత న శ్వేపి తదభిమాని దేవతాభిప్రాయేణ నమస్కారః కృతః" " ఈ మంత్రముచే చేయవలసిన ప్రక్రియ ఏమన వంశాను క్రమముగ వచ్చెడి క్షయ, కుష్ఠము మున్నగు ఉగ్రవ్యాధు లచే పీడితుడగు రోగికి అట్టి రోగోపశమనమునకై పై అథర్వమంత్రముచే ఉదకుంభమును అభిమంత్రణము చేసి, ఎడ్లతోగూడిన నాగలి క్రింద ఆరోగిని కూర్చుండ బెట్టి అయ్య భీమంత్రితోదకముచే స్నానము చేయించవలెను.