పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కొండపల్లి సంగ్రహ ఆంధ్ర


సైనికుని ప్రప్రథమ కర్తవ్యము. సాయుధ మైన రెండు వేల సైనికదళ మీ బురుజునకు కావలి. ఇచ్చట రణభేరి మ్రోగుట యేమి, నాలుగు బురుజుల యందలి సేనాధి కారులు సమరసన్నద్ధు లగుట యేమి, రెండును ఒక్క త్రుటిలో జరుగుచుండెను. అంతఃపురములకును, రాజవీధులకును, వెనుక భాగము నందు రెండు గొప్ప తటాకము లున్నవి. అవి కాలక్రమ మున తటాకీను లైన వేమో! వీని కిప్పటికిని 'టాకి’ లను వాడుకకలదు. వీటి యందలి జలము పానయోగ్యమై, పాంథజన శ్రమాపనోదన శీతలమై యున్నది. ఈ తటాక ముల లోతు నిర్ణయింప లేము. వీటి తీరమున ఎవ రేని ఏమాత్రపు ఏమరపాటుగా నున్నను ప్రమాదమే. దర్బారు భవనమునకు పురోభాగమునం దొక సరో వర మున్నది. ఈ కొలనికి రాణులు చెలికత్తెలతో జల కేళి సవరింప వచ్చెడివారు. పరమేశ్వర సృష్టిలోని పక్షి సంతతి కంతయు నీ సరస్సు వినోద క్రీడాసీమ. దీనియందు ఆ దినములలో సాయం సంధ్యా వాయుసేవనార్థమై రాజ దంపతులు లక్కపడవలలో విహరించెడి వారు.

అన వేమా రెడ్డి (క్రీ. శ. 1364-1988) కొండపల్లి కోటను పాలించినాడు. ఈతడే కొండపల్లి దుర్గమును పాలించిన మొదటి రెడ్డి రాజు. పెద కోమటి వేమా రెడ్డి (14021420) తాను కొండవీటి రాజుగానుండి తన తమ్ముడైన మాచారెడ్డిని యువరాజ పట్టభద్రుని జేసి కొండపల్లి సీమకు పాలకునిగ నియమించెను. యువరాజగు మాచారెడ్డి కొండపల్లి రాజ్యమును సమర్థతతో పాలించి ప్రజానురంజకుడై నాడు. పెదకోమటి వేముని పిమ్మట రాజవేముని పాలనతో (1420 - 1424) రెడ్డి రాజ్యము గజపతుల హస్తగతమైనది. ఆ యొడైరా జన్ని సీమలను, కొండకోటలను ఆక్రమించెను. గజపతి వంశీయులైన ప్రతాపదేవరాయలు పదునే డేడులును, హరిహరరాయ లై దువత్సరములును, కొండ వీడు, కొండపల్లి రాజ్యముల నొకరి తరువాత నొకరు పరిపాలించినారు (క్రీ. శ. 1431-1454). వీరి కాలములో నీ రాజ్యము విజయనగర మహాసామ్రాజ్యములో కలుప బడినది. పిమ్మట కపిలేశ్వరగజపతి (క్రీ.శ. 1455-1461) విజయనగర సామ్రాజ్యాధికారులు నోడించి యాంధ్ర దేశ

మును, అందలి కొండపల్లి రాజ్యమును వశపరుచుకొని పాలించినట్లు బెజవాడ ఇంద్రకీల పర్వతముమీది శాసనము వలన తెలియుచున్నది. బహమనీ సుల్తానులలో నొకడగు రెండవ మహమ్మదు షా (క్రీ. శ. 1463-1482) ఆంధ్రదేశముపై కన్ను వేసి, గజపతులను జయించి తద్రాజ్యమంతయును ఆక్రమిం చెను. ఈతని కాలమునందే కొండపల్లి కోటయందు కొన్ని మార్పులు గలిగినవి. ఇతడు కోట పై భాగమును, దుర్గ మును గూడ బాగుచేయించెను. ఇతడు దుర్గముక్రింద నొక గ్రామమును గూడ నిర్మించెను. కాని నిర్మాణ మప్పుడు ప్రాకారములు నిలువకుండెనట! పునాదులు పదింబదిగా కూలిపోవుచుండెను. అప్పుడు “కొండ"డను నొక గొల్లవానిని, “పల్లె" యను నతని భార్యను బలి యిచ్చి, పునాదులు వేసి గోడలు కట్టిరట! అప్పుడు గోడలు నిలువబడినవట ! నాటితో క్రిందనున్న గ్రామమునకు "కొండపల్లి" యను పేరు సార్థకమైనదట! కపిలేశ్వర గజపతి పుత్రుడు అగు పురుషో త్తమ గజపతి మహారాజు మహమ్మదుషా పుత్రులను భారద్రోలి కొండపల్లి సీమకు రాజయ్యెను. నరసారావు పేట సమీప మునను బెజవాడ దగ్గర 'ముస్తాబాద' సమీపమునను గల 'పురుషోత్తమ పట్టణములు' ఈతని పేరిటనే నిర్మింప బడినవి. పిదప ఒరిస్సా రాజగు అంబర రాయలు కొండపల్లి దుర్గమును జయించి పాలించినాడు. ఈతడు తన తమ్ము డైన మంగళిరాయని వలని బాధ నోర్వలేక రెండవ మహమ్మదుషా ముఖ్యమంత్రి యగు మహమ్మదు గవా నుని సాహాయ్య మర్థించెను. కాని ఆ గవాను ఈ సోదరుల నిర్వురను వంచనచే పరిమార్చి ఆ రాజ్యమంతయు మహ మ్మదుషా రాజ్యములో విలీన మొనర్చినాడు (1471). ఆ యేడే ప్రతాపరుద్ర గజపతి మహమ్మదీయులను బార ద్రోలి తిరిగి కొండవీడు కొండపల్లి సీమలపరిపాలనమును నిష్కంటకముగ సాగించెను. ప్రతాపరుద్రుని యనంతరము వీరభద్ర గజపతి రాజై తన పేరిట కొండపల్లిలో గ్రామమునకు దక్షిణ ముగ నొక చెరువు త్రవ్వించినాడు. దానికి నేటికిని విద్యా ధర గజపతి చెరువని వ్యవహృతి. ఇతడు బెజవాడకు సమీప మున గల విద్యాధరపురమును గూడ గట్టించెను. 48