చైనాదేశము (చ)
సంగ్రహ ఆంధ్ర
నెలకొల్పి పరిపాలన సాగించిరి. ఈ పరిస్థితులలో చైనాలో ఐరోపియనులు ప్రవేశించిరి.
ఐరోపియనులు, నల్లమందు యుద్ధములు : వాస్కోడిగామా గుడ్‌హోపు మార్గమును కనుగొన్ననాటినుండి, సముద్రమార్గమున పాశ్చాత్యులు చైనాకు రాసాగిరి. క్రీ. శ. 1557 నాటికి పోర్చుగీసువారు క్వాంటంగ్, ఫ్యూకిన్ రాష్ట్రములలో స్థావరము లేర్పరచుకొనుటయే గాక, మకావోలో కోటలు కట్టుకొనిరి. పోర్చుగీసువారి అడుగు జాడలలో, డచ్చివారు ఫార్మోజా దీవి (తైవాన్) లో క్రీ. శ. 1664 నాటికి స్థావరములను సాధించిరి. క్రమముగా చైనా వాణిజ్యము ఆంగ్లేయులను కూడ ఆకర్షించెను. 1773 లో ఆంగ్ల రాయబారి యైన మెకార్ట్నీ, మంచూ చక్రవర్తి చీన్‌లుంగ్‌ను దర్శించి, చైనాలో వాణిజ్య హక్కుల వర్థించెను. చక్రవర్తి నిరాకరించుటతో మెకార్ట్ని రాయబారము విఫలమైనది. కాని మంచూ చక్రవర్తులు మకావో రేవులోను, కాన్‌టన్‌లోను విదేశ వర్తకులకు ప్రవేశార్హత నొసగిరి. కావున ఈ రెండు నగరములు పాశ్చాత్య వాణిజ్య కేంద్రములైనవి.
ఆంగ్లేయులు చైనాకు నల్లమందు దిగుమతిచేసి అపారమైన లాభములు గడించు చుండిరి. నల్లమందు అలవాటు వలన ప్రజల ఆరోగ్యమునకు హాని కలుగు చున్నదని, చియాచింగ్ చక్రవర్తి (1800) నల్లమందును నిషేధించెను. ఆంగ్లేయులు దొంగచాటుగా నల్లమందు వర్తకమును కొనసాగించిరి. 1839 లో లిన్‌చిహిసు అను ఉద్యోగి, క్యాంటన్ లో 20 వేల పెట్టెల దొంగ నల్లమందును పట్టుకొని తగులబెట్టెను. దీనితో చైనా ప్రభుత్వమునకును; ఆంగ్లేయులకును రెండు యుద్ధములు జరిగెను. ఇవియే నల్లమందు యుద్ధములు (Opium wars). మొదటి యుద్ధములో (1839-1842) చైనా ఓడిపోయి 'నాన్కింగ్' సంధి చేసికొని ఆంగ్లేయులకు హాంగ్ కాంగ్ ద్వీపము నిచ్చుటయేగాక కాన్‌టన్, షాంఘై, అమాయ్, ఫూచో, నిన్‌గ్‌ఫూ రేవులలో స్వేచ్ఛగా వర్తకము చేసికొనుటకు హక్కుల నిచ్చెను. క్రైస్తవమత ప్రచారమునకును అనుమతించెను. 1856 వ సం॥ యుద్ధములోకూడ చైనా పరాజయము పొంది, టీన్ట్సిన్ సంధి చేసికొని, ఆంగ్లేయులకు మరికొన్ని హక్కు లొసగి పై సంధి షరతులను ఫ్రాన్సు, అమెరికా, జర్మనీ, నార్వే మొదలయిన దేశములకు గూడ వర్తింపజేసెను. దీనికే "మిక్కిలి అభిమానముతో చూడబడెడి జాతుల" హక్కులందురు (Most favoured Nation treatment). చైనాలో తమతమ న్యాయస్థానములు నెలకొల్పుటకుకూడ పాశ్చాత్యులకు హక్కు లీయబడెను (Extra - territorial Rights). మంచూ సామ్రాజ్యాధికారము విచ్ఛిన్నమై, చైనాలో పాశ్చాత్యుల అధికార ప్రాబల్యములు స్థిరపడసాగినవి.
టైపింగ్ తిరుగుబాటు క్రీ. శ. 1850-1865 : పై పరిణామముల ఫలితముగ చైనా ఆర్థిక వ్యవస్థ భగ్నమైనది. పన్నులబాధ నానాటికి పెరుగుచుండెను. నల్లమందుతో బాటు, వస్త్రములు మొదలైన పెక్కు విదేశ వస్తువులు దిగుమతియై దేశపరిశ్రమలు పూర్తిగ నశించెను. నిరుద్యోగము ప్రబలమైనది. మంచూ ప్రభుత్వమునందును, విదేశీయుల పట్లను ద్వేషము పెచ్చు పెరుగ సాగినది. "ప్రజలకు ఉద్యోగు లనిన భయము. ఉద్యోగులకు విదేశ భూతము లనిన భయము. విదేశ భూతములకు ప్రజ లనిన భయము.”
ఈ పరిస్థితిలో, క్వాంగ్సీరాష్ట్రవాసియైన హుంగ్ హిస్యు సుంగ్ అను క్రైస్తవ ఉపాధ్యాయుడు, తాను "జీససు తమ్ముడ" నని ప్రకటించుకొని మంచూ ప్రభుత్వముపై తిరుగుబాటు పురికొల్పెను. తండోపతండములుగ ప్రజ లీ తిరుగుబాటున చేరుటతో, 1856 నాటికి తొమ్మిది రాష్ట్రములు హుంగ్ వశమైనవి. నాన్‌కింగ్ రాజధానిగా “దివ్యశాంతి రాజ్యము” ను (Tai Ping Tien Kuo) హుంగ్ స్థాపించెను. కాని, విదేశీయుల సహాయముతో మంచూ చక్రవర్తులు ఈ తిరుగుబాటు నణచివేయ గలిగిరి. టైపింగ్ తిరుగుబాటు మంచూ చక్రవర్తుల అసమర్థ నిరంకుశత్వమునకు తోకచుక్క యైనది.
చైనా జపాన్ యుద్ధము 1894 : పాశ్చాత్య రాజ్యములతో బాటు జపాన్‌కూడ. చైనాదుస్థితిని అవకాశముగా గొని ఆసియాలో విస్తరించుటకు ప్రయత్నించెను. 1894 లో కొరియాపై అధికారమును గురించి చైనా, జపానులకు జరిగిన యుద్ధములో చైనా ఓడిపోయి 'షిమొనెస్కీ ' సంధి చేసికొనెను. దీనిప్రకారము ఫార్మోజా
750