Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/790

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

చెన్నపట్టణము 728 సంగ్రహ ఆంధ్ర


చెన్నపట్టణము నిర్మాణమును గూర్చి మనకు మొట్ట మొదట “ఉషాపరిణయము” అను ప్రబంధమువలన తెలియ నగుచున్నది. ఉషాపరిణయ ప్రబంధమును కాళహస్తి సంస్థానాధీశ్వరులలో పూర్వుడైన దామెర్ల అంక భూపాలుడు రచించి యున్నాడు. అందిట్లు గలదు : "ప్రళయకావేరి మైలాపురంబుఁ గల్మి బీరమున బోర నది మట్టు పెట్టఁ దండ్రి పేరఁ దన్మధ్య భూమినిఁ బృథువిభూతి నలవరిచెఁ జెన్నపట్టణ మయ్య నృపతి. "

ఈ పద్యములో బేర్కొనబడిన 'అయ్యనృపతి' అంక భూపాలుని సోదరుడు. ఈ అయ్యనృపతి తన తండ్రియగు చెన్నప్పనాయని పేర ప్రళయకావేరి — మైలాపురము వేరి— ప్రదేశముల మధ్య "చెన్నపట్టణము” అనునొక పట్టణ మును నిర్మించెనని అంక భూపాలుడు తెలిపినాడు. ప్రళయకావేరి అనగా నేటి "పులికాట్". ఈ పులికాట్ (నేటి మైలాపూరుల మధ్య చెన్నపట్టణము నిర్మితమైనదని స్పష్టమగుచున్నది. అంకభూపాలుడు, అయ్యపనాయ కుడు, వెంకటప్పనాయకుడు అనువారు ముగ్గురు సోద రులు. దామెర్ల చెన్నప్పనాయని కుమారులు. ఈ వంశ వృక్షమును ఉషాపరిణయ ప్రబంధము తెలుపు చున్నది. చెన్న పట్టణ నిర్మాణము క్రీ.శ. 1544 అని శ్రీ టంగుటూరి ప్రకాశంగారును, క్రీ.శ. 1550 అని శ్రీ నిడుదవోలు వేంకట రావుగారును తెలుపుచున్నారు.

ఈ చెన్నపట్టణమును ఎందుకు నిర్మాణము చేయవలసి వచ్చినదో అంకభూపాలుడు తెలిపియున్నాడు. ఆ కాల ములో "పులికాట్" (ప్రళయకావేరి) నందు డచ్చి వారును, మైలాపురమునందు పోర్చుగీసువారును వర్త కము చేయుచు పరస్పరము కలహము లాడుచుండిరి. ఆ కలహములను నివారించుటకు అయ్యనృపతి ఈ రెంటి మధ్య భాగమున చెన్న పట్టణము నిర్మించినాడట !

దామెర్ల చెన్నప్పనాయకుని పుత్రులలో జ్యేష్ఠుడగు వేంకటప్ప “వందవాసి" ని రాజధానిగా చేసికొని ప్రళయ కావేరి (పులికాట్) నుండి కడలూరువరకు గల ప్రాంత మును ఏలుచుండెను. అయ్యప్ప పూనమల్లిని ముఖ్యపట్టణ ముగా చేసికొని సముద్రతీర ప్రాంతములను పాలించు చుండెను. వీరు విజయనగర సామ్రాజ్యాధిపతి యగు

వెంకటపతి రాయల బావమరదులు. ఈ కాలమున వెంకట పతిరాయలు తన రాజధానిని వేలూరు నగరమునకు మార్చుకొనెను. అప్పటినుండి వేలూరు రాయవేలూరుగా ప్రసిద్ధి చెందెను. వెంకటాద్రి (వేంకటప్ప నాయకుడు చంద్రగిరిరాజుల పక్షమున రాజ్య పాలనాధి కారియై యుండెను. దామెర్ల వెంకప్పనాయకుడు అప్పటి విజయనగర సామ్రాజ్యాధిపతి యగు పెద్ద వెంకటపతిరాయల యాజ్ఞ చొప్పున నాయక రాజు లందరిలోను ప్రధానుడుగా నుండెడివాడు. ఈ వెంకటప్పనాయకుడు తన తండ్రి చెన్నప్ప నాయకుని పేర చెన్నసాగరము కట్టించినాడు. ఈ చెన్న సాగరము నార్తార్కాటు జిల్లాలో నున్న పెద్ద తటాకము. దామెర్ల వెంకటప్ప తన తండ్రి పేర చెన్న సాగరము కట్టించగా అతని సోదరుడు అయ్యప్ప నాయ కుడు తన తండ్రి పేర చెన్నపట్టణమును గొప్ప సంపదతో కట్టించినాడు.

చెన్నప్పనాయకుడు అసామాన్యవ్యక్తి. చెన్న పనాయని తమ్ముడగు వెంగళరాజు రచించిన బహుళాశ్వ చరిత్ర మను ప్రబంధములో చెన్నపనాయకుడు ఇట్లు వర్ణింప బడినాడు: “తన భుజాభుజగ ప్రతాపానలంబునకు బ్రత్యర్థకీర్తి పారదముగాఁగ దనధాటి కారటత్పటహ గర్జక రాతి పార్థివావలి హంసపటలిగాఁగ ... వరలు దామెర్ల వంశ పావన చరిత్రుఁ పావనచరిత్రుఁ డాహవ కిరీటి యర్థిదై న్యాంధ తమస భాస్కరుండు శోభమాన యశస్కరుండు చెన్న భూపాలుఁ డరిరాజ సన్నుతుండు

ఇట్టి మహాయోద్ద, మహారాజు, మహారసికుడు, మహాను భావుడు అగు చెన్నప్ప పేర గట్టబడిన దీ చెన్న పట్టణము .

ఈ చెన్నపట్టణము పుట్టుకకు బూర్వమే ఇదే స్థలము దీనికి కొంచె మిటో, అటో ఒక చిన్న యూరు ననో,