Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/772

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చిలీదేశము

సంగ్రహ ఆంధ్ర

వక్తగను, చిత్తశుద్ధి, అచంచల దీక్ష గల సంఘ సేవకుడుగను, నిర్వాహకుడుగను ఎన్నిక గనిరి.

1893 వ సంవత్సరమున పురాణపండ వేంకటదీక్షితులుగారి తనయ వెంకాయమ్మతో వీరికి వివాహమైనది. కాని సంతానము కలుగలేదు. అయితే, అప్పచెల్లెండ్ర యొక్కయు, తమ్ముని యొక్కయు సంసారములను వీరే నిర్వహించిరి.

వీరి స్వీయచరిత్రము కూడ ఇటీవలెనే ప్రచురింప బడినది.


“భరతఖండంబు చక్కని పాడియావు
 హిందువులు లేగదూడలై ఏడ్చుచుండ
 తెల్లవా రను గడుసరి గొల్లవారు
 పిదుకుచున్నారు మూతులు బిగియగట్టి"


అను వీరి పద్యము వీరి జాతీయాభిమానమునకును, 'అల్లుడా రమ్మని ఆదరమ్మున బిల్వబంపు' అను పద్యము వీరి ఉజ్జ్వల నాటక రచనమునకును, 'ముదితల్ నేరగరాని విద్య కలదే ముద్దార నేర్పించినన్' అను పద్యము వీరి స్త్రీ విద్యాభిరతికిని పేరుబడసి ప్రజలలో మిక్కిలి ప్రచారము నొంది, వీరిని ప్రజా కవిగా తీర్చిదిద్దినవి.

ఈ మహావ్యక్తి 1947 సం. జూను 17 వ తేదీనాడస్తమించెను.

ఊ. ల.


చిలీ దేశము :

దక్షిణ అమెరికాలో బహుకాలముగా ఘటిల్లిన విప్లవములను, కలహములను బట్టి చూడగా, 'చిలీ' తరతమ భావముచే ప్రశాంతమగు చరిత్రగల దేశమనవచ్చును. కాని అది ఇటీవలి కాలమున తరచుగా సంభవించుచు వచ్చిన కార్మిక కలహముల కారణముగా గొప్ప ఇక్కట్టులకు గురియైనది,

క్రీ. శ. 1536 వ సంవత్సరమున ప్రప్రథమముగా యూరపియనులు చిలీ దేశమున దిగిరి. డైగో డీ ఆల్ మగ్రో (Diego de Almagro) అను నతడు ఆ సమయమున ' పెరూ' (Peru) నుండి చిలీపై దండయాత్రచేసి విఫలమనోరథు డయ్యెను. అయిదు సంవత్సరముల అనంతరము పెడ్రో డీ వాల్ డివియా (Pedro de Val-divia) అను మరియొక స్పెయిన్ దేశీయుడు సాంటియాగో (Santiago) ను స్థాపించెను. 1810 వ సంవత్సరము సెప్టెంబరు 18 వ తేదీన చిలీ దేశీయులు స్పెయిన్ ఆధిపత్యముపై తిరుగబడిరి. కాని వారికి 1818 వ సంవత్సరము వరకు సంపూర్ణ స్వాతంత్ర్యము లభింపకుండెను. ఆ సంవత్సరమున బెర్‌నార్డో ఓ హిగ్గిన్స్ (Bernardo o Higgins), జోస్ డీ సాన్ మార్టిన్ (Jose de san Martin) అనువారు తుదకు స్పానిష్ సైన్యములను అణగద్రొక్కిరి.

చిలీ ఎన్నడును యుద్ధమున పరాజయ మొందిన దేశము కాదు. దానికిని బొలివియా (Bolivia). పెరు (Peru) లకును నడుమ 1879-83 సంవత్సరముల మధ్య కాలమున యుద్ధము సంభవించెను. ఆ యుద్ధములో 'ఆన్‌టో ఫాగస్టా' (Anto Fagasta) అను పేరుతో బొలివియాకు గల ఏకైక సముద్రమార్గమున్న రాష్ట్రమును, దానితోపాటు, పెరుకు చెందిన విశాల భూభాగములును చిలీ కైవసమయ్యెను. మొదటి ప్రపంచ మహాసంగ్రామమందు చిలీ తటస్థముగానుండెను. 1927 వ సంవత్సరమున కర్నల్ కార్లోస్ ఇబాఫియజ్ (Colonel Carlos Ibafiez) అనునతడు అధికారమును తన హస్తగత మొనర్చుకొనెను. అతనికి 1931 వ సంవత్సరమున పతనము సంభవించెను. అతని పతనమునకు అనంతరము కొలదికాలమువరకు అరాజకపరిస్థితు లేర్పడెను. ఆ స్వల్ప కాలమునందే ఏడ్గురు వ్యక్తులు దేశాధ్యక్షులగుటయు, తిరిగి పదభ్రష్టులగుటయు గూడ తటస్థించెను. కాని డా. ఆర్టురో అలెస్సాండ్రీ (Dr. Arturo Alessandri) 1932-38 సంవత్సరము మధ్యకాలములో చిలీ యొక్క రాజకీయ, ఆర్థిక స్థైర్యమును నెలకొల్పుటకు గొప్ప ప్రయత్నమొనర్చెను.

1938 వ సంవత్సరమున జరిగిన ఎన్నికలలో విజయుడైన పెడ్రో ఆగ్విరే సెర్‌డా (Pedro Auguirre Cerda) అను నతడు 1941 నవంబరు 25 వ తేదీన మరణించెను. ఇతడు తన మరణమునకు పూర్వమే విపులమైన ఒక సామ్యవాద ప్రణాళికను దేశములో ప్రవేశపెట్టెను. 1942 సం. లో 'ప్రజాపక్షము'న (popular Front) తీవ్రవాదియైన జువాన్ ఆన్‌టోనియా రియోస్ (Juan Antonio Rios) అభ్యర్థిగా ఎన్నుకొనబడెను. ఆతని

710