పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

విజ్ఞానకోశము - 3

కేరళదేశము (భూగోళము)


1-11-1956 వ తేదీన నిర్మాణమైనది. పూర్వపు తిరువా న్కూరు. కొచ్చిన్ రాష్ట్రముల భూభాగములును (కొన్ని మినహాయింపులతో), మద్రాసు రాష్ట్రాంతర్గతమగు మల బారు జిల్లాయు, దక్షిణ కెనరా జిల్లాలోని కాసరగోడు తాలూ కాయు ఈ కేరళ రాష్ట్ర మునచేరియున్నది. పూర్వపు తిరు వానూరు-కొచ్చిన్ రాష్ట్రమునుండి నాగర్కోయిల్, కన్యాకుమారి మున్నగు నాలుగు తాలూకాలును, షెన్ కొట్టాలోని కొంత భాగమును మద్రాసు రాష్ట్రములో చేర్పబడినవి. ప్రస్తుతము ఈ రాష్ట్రము యొక్క దక్షిణపు సరిహద్దు క న్యాకుమారికి ఉత్త రమున 35 మైళ్ళ దూరమున నున్న 'పాఠశాల' అను గ్రామము. ఉత్తరమునను, ఈశాన్యమునను మైసూరు రాష్ట్రపు సరిహద్దులను, తూ ర్పునను, దక్షిణమునను మ ద్రాసు రాష్ట్రపుసరిహద్దులను గలిగిన ఈ రాష్ట్రము అ రే బియా సముద్రతీరమున 360 మైళ్ళ వరకు ఉత్తర దక్షిణ ముగా ప్రాకుచున్నది. కేరళ రాష్ట్ర వై శాల్యము ఉత్తర రక్షిణాగ్ర భాగమున 20 మైళ్ళ నుండి మధ్యభాగ మున TS మైళ్ల వరకును వ్యాపించి యున్నది. కేరళ రాష్ట్రము 8-18' మరియు 12°-48' ఉత్తర అక్షాంశ మధ్యభాగ

, 74°-52' మరియు 77-22' తూర్పు రేఖాంశ

ముల మధ్యభాగమునను ఉన్నది.

కేరళముయొక్క విస్తీర్ణము 14,992 చ. మైళ్ళు. స్విట్జర్లాండు, ఆల్బేనియా, బెల్జియం, మున్నగు ఐరోపా కాజ్యములకంటె విస్తీర్ణమందును, జనసంఖ్య యందును కేరళ రాష్ట్రము పెద్దదని చెప్పవలసియున్నది. కొండలు : కేరళమును పరిసర ప్రాంతముల నుండి పశ్చిమ కనుమలు విడదీయుట వలన ఆ రాష్ట్రమున కొక

ప్రత్యేకత కలదు. పశ్చిమ కనుమలచే ఈ రాష్ట్రము యొక్క భౌగోళిక పరిస్థితులు ప్రభావితములై యున్నవి. పశ్చిమమున సముద్రమును, తూర్పున పశ్చిమ కనుమలును గలిగిన సన్నని భూభాగమే కేరళ రాష్ట్రము. ఈ పశ్చిమ కనునుల ఎత్తు 3000 అడుగుల నుండి 6000 అడుగుల వరకును పెరిగి, కొన్ని స్థలములందు 8000 అడుగుల వరకును అందుకొనును. కొట్టాయం జిల్లాలోని 'ఆ నెముది ' శిఖరము 8,837 అడుగుల ఎత్తుగలిగి, హిమాలయమునకు దక్షిణమునగల పర్వత పంక్తు లన్నిటికంటె ఎత్తయినదిగా పరిగణింపబడుచున్నది. నదులు : అధిక వర్ష పరి మాణమువల్లను, మిట్టపల్ల ములుగా నున్న భూమి యగుట చేతను, అనేక క మలు నదులు, వాగులు ఈ రాష్ట్ర మున ప్రవహించుచున్నవి. అవ న్నియు అరేబియా సముద్ర మున కలియుచున్నవి. పశ్చిమ ఏ ప్రదేశమునను సముద్రమునకు 75 మైళ్ళ కంటె ఎక్కువ దూరమున లేనందున ఈనదులు చిన్నవిగా నున్నవి. ఉత్తర దక్షిణముగా చూచినచో (1) వరల పట్ట ణము (70 మైళ్లు), (2) బారి యాన్ (98 మైళ్ళు), (8) కడ లుంది (75 మైళ్ళు), (4) భార తపుఝా (166 మైళ్ళు), (5) చాలకుడి (10 మైళ్ళు), (6) పెరియార్ (142 మైళ్ళు), (7) పంపా (90 మైళ్ళు), (8) అచ్చన్ కోవిల్ (70 మైళ్ళు), (9) కల్లడ (70 మైళ్ళు) అను ముఖ్యమైన నదులు ఉన్నత ప్రదేశమునుండి ప్రవహించుచు 500 అడుగులకంటే ఎక్కువ ఎత్తునుండి కొన్నిచోట్ల క్రిందికి జారుచుండును. అందుచే అచ్చట విద్యుచ్ఛక్తి యొక్క ఉత్పాదనమునకును, జల సేచనమునకును ఈ నదులు మిగుల అనువగు అవకాశములు కల్గించుచున్నవి. 37