Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/714

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చార్లీ చాప్లిన్

సంగ్రహ ఆంధ్ర

వములు, వాటితీరు తెన్నులు, వాటిని పరిష్కరించు విధానములు సామ్యవాద వ్యవస్థలో రూపాంతర మొందును. ఇంతవరకు జరిగిన విజ్ఞానశాస్త్రాభివృద్ధి ఎక్కువగా ఏకవర్గప్రయోజనములకు మాత్రమే ఉపయోగించినది. ఇక ముందు మానవసంఘము తమ సమష్టి కృషిఫలితమును సమష్టిగా అనుభవించుటకు అవకాశ మేర్పడగలదని ఆశించబడుచున్నది.

ప్ర. రా. సు.


చార్లీ చాప్లిన్ :

“అన్ని రసముల మరపించు హాస్యరసము” అని పూర్వమొక కవిపుంగవుడు పలికెను. హాస్యరసము రెండు విధములుగా నుండును. ఒకటి మోటుహాస్యము; రెండు సున్నితమైన హాస్యము. భౌతిక సంబంధమయిన వెకిలి చేష్టలవలన మోటుహాస్యము ఉత్పన్నమగును. కాగా సున్నితమైనహాస్యమును సృష్టించుటకు హృదయాంతరాళ మందుండెడి జీవతంతువులు స్పందించవలసియుండును. మోటు హాస్యరస పోషణమునకు అంతగా పరిశ్రమ అవసర ముండదు. కాని సున్నితమైన హాస్యరసమును పోషించుట ఎవరెస్టు శిఖరమును ఎక్కినంతపనిగా భావింప వచ్చును. సున్నితమైన హాస్యరస పోషణములో అంతర్జాతీయముగా కీర్తి నార్జించిన నటులు అత్యంత స్వల్ప సంఖ్యలో మాత్రమే కలరు. వీరిలో అగ్రతాంబూలమునకు చార్లీ స్పెన్సర్ చాప్లిన్ ఒక్కడే అర్హుడు.

చాప్లిన్ 1889 ఏప్రిల్ 16 వ తేదీన లండన్ నగర

చిత్రము - 190

చార్లీ చాప్లిన్ వివిధ హావభావభంగిమలు



654