చదరంగము - 2
సంగ్రహ ఆంధ్ర
గుఱ్ఱము : తానున్న గడినుండి తిన్నగా నాలుగు దిక్కులకు నిలువుగా గాని, అడ్డముగా గాని మూడవగడికి పోయి ఆ గడికి రెండువైపులగల గళ్ళలో ఏగడియందైనను నిలుచును. ఇది తన దారియం దెట్టి బలగమున్నను, వానిని దాటి తన గడిని ఆక్రమించు శక్తిగలది కనుక,
చిత్రము - 178
పటము - 1
అట్టడుగు వరుసలో ఎడమనుండి కుడికి ఏనుగు, గుఱ్ఱము, శకటము, మంత్రి, రాజు, శకటము, గుఱ్ఱము, ఏనుగు.
పైవరుసలో : బంట్లు
గుఱ్ఱపునడకను 'గుఱ్ఱపుదాటు' అనికూడ వ్యవహరింతురు. తనదారియందు అడ్డమున్న బలమునుగాక తానాక్రమింప బోవు గడియందు శత్రుబలమున్నచో దానిని చంపును. తన బలమే యున్నచో ఆ గడిని ఆక్రమింపజాలదు కాని, రక్షణ నిచ్చును. రాజు మంత్రి, ఏనుగులు, శకటములు తమ నడకయందు తమ బలగమే అడ్డున్నచో ఆగిపోవును.
బంటు : పుట్టుక స్థానమందున్నపుడు తిన్నగా తనముందున్న ఒక గడిగాని రెండుగళ్ళుగాని నడుచును. తరువాత మాత్రము ముందునకు ఒక గడివంతున మాత్రమే నడచును. ముందుగడికి నడచిన బంటు వెనుకకు రాజాలదు. తన గడికి ఎదుటనుండు రెండు మూలగళ్ళలోని శత్రు బలగములో దేనినైనను చంపును. తన బలగమును రక్షించును. నడకయందు ఏనుగువలెను, చంపునపుడు శకటము వలెను చలనముగలది. బంటు క్రమముగా తన నడక యందు ఏ శ్రేణియందైనను శత్రుస్థావరమున ఎనిమిదవ గడికి చేరిన, మంత్రిగా నైనను, లేక అటగాని కిష్టమగు మరియొక యే జంతువుగనైనను మారును. బంటు నడకలో "ఎన్ఫా సెంటు" అను మరియొక విధానము గలదు. బంటు పుట్టుకగడినుండి రెండుగళ్ళు నడచునపుడు ఆ మొదటి గడియందు శత్రు బంటు వీక్షణము ఉన్నచో, ఆ బంటుచే, పుట్టుకగడి నుండి నడపబడు బంటు చంపబడును. అట్లు నడకను అడ్డగించి బంటు బంటును చంపుటయే “ఎన్ఫాసెంటు" అనబడును.
కోట కట్టుట : ఇది రెండు రకములు. 1. రాజువైపు కోట. 2. మంత్రివైపు కోట. కోట కట్టుటకు పూర్వము రాజు పుట్టుకగడిలోనే యుండవలెను. ఏనుగుగూడ పుట్టుక గడిలో నుండవలెను. ఆట ప్రారంభమునుండియు, రాజు,
చిత్రము - 179
పటము - 2.
రాజు - - కోట కట్టుట
రాజు, ఏనుగుల మధ్యగల గళ్ళు ఖాళీగా నుండవలెను. శత్రు వీక్షణ ముండరాదు. 1. ముందు రాజు కదలవలెను. 2. తరువాత ఏనుగు కదలవలెను.
612