విజ్ఞానకోశము - 3
ఘటికాస్థానములు
ప్రస్తావము కలదు. ఈ విధముగానే కన్నడదేశ శాసనములలో ఘటికకు చెందిన బ్రాహ్మణులపేర్ల ముందు 'ఘటికా సాహస్ర' పదము కానవచ్చును. దీనినిబట్టి ఒక వేళ ఘటిక యందు వేయిమంది (అధ్యాపకులు, అధ్యతలు కలసి) ఉండెడివారేమో అనిపించును. పశ్చిమ గాంగభూపతి శివమారుని హెలిగెరె తామ్రశాసనములో హరితసగోత్రుడైన మాధవశర్మ ( 'ఘటికా సాహస్రాయ హరితస గోత్రాయ మాధవశర్మణే') ఘటికా సాహస్ర మాధవశర్మ యని పేర్కొనబడినాడు. ఇట్టి శాసనము లింకను గలవు. చాళుక్య వంశజుడైన మొదటి జయసింహవల్లభుని నిడమర్రు శాసనమునందలి ప్రతి గ్రహీతయైన 'కాటిశర్మ పితామహుడు'ను, 'సపదక్రమానుక్రమాధీత వేదద్వయుడు'ను, 'సకల్పోపనిషత్పురాణేతిహాసానేక ధర్మశాస్త్రవిదు'డును అయిన మండశర్మ అసనపురస్థాన నివాసియు, ఘటికా సామాన్యుడు నట! అనగా అసనపురమందలి ఘటికకు చెందినవాడు. ఘటికకు చెందిన విప్రోత్తములను, ఘటికా సామాన్యులని వ్యవహరించుచుండి రేమో - పూర్వము వారికి మహాజనులనియు వ్యవహార ముండెను.
మహారాజ ప్రతిష్ఠాపితములు, పోషితములు అగుటచేత కర్ణాటదేశ శాసనమొకటి కుంతలదేశమును "ధర్మక్కె నెర్మముం భోగక్కాగరము మాద ఘటికాస్థానముం" అని ధర్మమునకు సహకారకములును, భోగముల కాకరములు నగు ఘటికాస్థానములకు నెలవని వర్ణించుచున్నది.
సాధారణముగా ఘటికాస్థానము లెక్కడ నుండెడివను విషయము విచారణీయము. నాగవావిలోని శాసనములు తదగ్రహారములో ఘటికాస్థానము స్థాపితమైనదని చెప్పుటవలన అగ్రహారమును, ఘటికయు విద్యాస్థానములే యైనను అగ్రహారము వేరు, ఘటిక వేరు; అగ్రహారము ఘటికకాదు. ఘటిక అగ్రహారముకాదు. ప్రాయికముగా ఘటిక దేవాలయమున నుండెడి దని తోచుచున్నది. ఇందుకు నాగాయి శాసనములే ప్రమాణము. "హెంజర పట్టణద, మహాఘటికా స్థానద శ్రీనోణం బేశ్వర దేవర సన్నిధానదల్లి " అని యొక కన్నడ శాసనములో నున్న విషయము కూడ పైని చేసిన యూహకు ఉపబలకముగ నున్నది. రాజసింహ నామాంతరమునం బరగు పల్లవ రెండవ నరసింహవర్మ 'పునర్వ్యధాద్యో ఘటికాం ద్విజానా' మన్న ఘటిక కూడ అతడు శశాంక మౌళికి కైలాస సదృశముగ నిర్మించిన శిలామయ వేశ్మము - కైలాసనాథాలయముననే యుండియుండవచ్చును.
తెలుగు కవులలో కేతన యింటిపేరు మూలఘటిక వారు. మూలస్థానేశ్వరుని యాలయమునందలి ఘటికకు 'మూలఘటిక ' యనుపేరు వచ్చెనో, దేవాలయ ప్రకరములో నుండిన వేరువేరు ఘటికలలో ప్రధానమైనదానికి మూలఘటిక యని పేరు వచ్చెనో తెలియదు. పూర్వము ప్రాముఖ్యముగల ప్రతి పురమున మూలస్థానేశ్వరాలయ ముండెడిది. అదియునుగాక త్రికూట మనుపేర ఒకటే చోట మూడేసి ఆలయములను నిర్మించు సంప్రదాయము కూడ పూర్వ ముండెడిది. ఇందుకు తెలంగాణా శాసనములే ప్రమాణము. ఎట్లయినను మూలఘటికకు సంబంధించినవా రగుటచేతనే కేతనకవి పూర్వులకు, మూల ఘటిక వారని ఇంటిపేరు కలిగినది.
వింధ్యకు దక్షిణమున నున్న దక్షిణహిందూ దేశమున ఘటికాస్థానము లెన్ని యెక్కడెక్కడ నుండెడివో తెలియదు. కాని పంచశత వీరశాసనుల మనియు, అయ్యావళీ పురవరాధీశ్వరుల మనియు చెప్పుకొన్న వీరబలంజవర్తక శ్రేణివారు తాము ముప్పదిరెండు హేలానగరము (కర పట్టణము) ల తోను, అష్టాదశనగరములతోను, అరువది నాలుగు యోగపీఠములతోను, అరువదినాలుగు ఘటికా స్థానములతోను, వర్తకవ్యాపారము సాగించుచు వచ్చినట్లు తమ శాసనములలో చెప్పుకొనియున్నారు. అందువలన దక్షిణదేశమున సంప్రదాయసిద్ధముగ వచ్చు ప్రఖ్యాత ఘటికాస్థానము లరువదినాలుగు ఉండినట్లు తెలియుచున్నది. ఇచట ఘటికాస్థానము లన్నది ప్రసిద్ధ పుణ్య క్షేత్రములందలి దేవాలయములకు పర్యాయపదముగ వాడబడేనేమో యని తోచుచున్నది.
దేవాలయములలో నుండెడు వేదవిద్యాపీఠములు, ఘటికాశాలలు, ఘటికాస్థానములు, ఘటికలు అని నిశ్చ యింప దగియున్నను వానికి ఘటిక యను పే రెట్లు వచ్చిన దను విషయము విచారింపవలసి యున్నది. “టు స్ట్రైవ్ఫర్” అను నర్థ మిచ్చు ఘట్ ధాతువునుండి ఘటికయను శబ్ద మేర్పడినదనియు, ఘటిక యన్న విద్యార్జనమునకై
541