Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/578

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ్రీసుదేశము (చ)

సంగ్రహ ఆంధ్ర

చిత్రము - 139

పటము - 1

ప్రాచీనకాలమునాటి గ్రీకుల విస్తృతి (క్రీ. పూ. 700-500)

మానములను అర్పించుటకై సంసిద్ధతవహించి యుండవలెనని స్పార్టనుల ఆశయము. స్పార్టారాజ్య ప్రభుత్వము ఒక సైనిక నియంతృత్వమువంటి దని చెప్పవచ్చును.

భిన్నత్వములో ఏకత్వము : గ్రీకు పౌరరాజ్యములలో ఎట్టి విభేదము లున్నను, తాము ఒకేజాతికి చెందినవార మను భావమును వారందరు కలిగియుండిరి. వారందరును డెల్ఫీలోని అపోలో దేవాలయపు దివ్యవాణి (Oracle) ని విశ్వసించుచుండిరి. హోమరుకవి రచించిన “ఇలియడ్”, “ఒడెస్సీ" అను మహాకావ్యములను చాల మన్నించుచుండిరి. నాలుగు సంవత్సరముల కొక పర్యాయము గ్రీకులందరును ఒలింపియా ఆటలలో సఖ్యతతో పాల్గొనుచుండిరి. పై అంశములు వారిని సంఘటిత పరచెను.

గ్రీకు పారసీక యుద్ధములు : క్రీ. పూ. 5 వ శతాబ్దమున పారసీకులకును, గ్రీకులకును మధ్య భయంకరమగు యుద్ధములు సాగెను. డేరియస్, జర్జస్ అను పారసీక చక్రవర్తులు గ్రీసుదేశముపై దండయాత్రలు సాగించిరి. క్రీ. పూ. 490వ సంవత్సరమున ఎథీనియనులు మారథాన్ యుద్ధమున పారసీకులను ఓడించి పారద్రోలిరి. క్రీ. వె. 480 వ సంవత్సరమున పారసీక సేనలు మరియొకసారి గ్రీసుపై దండెత్తెను. ఈ యుద్ధమున స్పార్టారాజ్యము వారు ఏథెన్సుకు సహాయపడిరి. స్పార్టారాజైన లియోనిడస్ అను మహావీరుడు 'ధర్మపోలీ' కనుమవద్ద పారసీకులతో అప్రతిమాన శౌర్యముతో పోరాడి తన సహచరవర్గముతో రణభూమిలో నిహతుడయ్యెను. పారసీకులు ఏథెన్సునగరమునకు చేరి, దానిని ధ్వంస మొనర్చిరి. కాని ఏథెన్సు రాజ్యమువారి నౌకాదళము పారసీక నౌకాదళమును సంపూర్ణముగ ఓడించెను. పారసీకులు

524