గ్రీన్‌లాండ్
సంగ్రహ ఆంధ్ర
పుష్కలముగా లభించు ఫాస్సిల్స్ (శిలాఖచితములు) ఆ ప్రాంతమందు 'టెర్టియారీ' (Tertiary) కాలమువరకును సమశీతోష్ణవాతావరణమే అంటిపెట్టుకొని యుండెనని రుజువు చేయుచున్నవి. 'టెర్టియరీ' అను అగ్నిపర్వత ద్రవములు, భూమి ఉపరితలముపై ప్రవహించినను, లేక భూగర్భములో అణగియుండినను అవి ఆ కాలమునాటి పర్వతములకు సంబంధించినట్టిదే. ఏది ఎట్లయినను, గ్రీన్‌లాండు యావద్భాగమును 'లారెన్షియన్ షీల్డ్ ఆఫ్ కెనడా' (Laurentian Shield of Canada) కు చెందిన ఒక భాగమనియే చెప్పవలయును.
ఖనిజములు : డిస్కా ద్వీపమునందును, కేవ్ యార్క్ వద్దను ఉల్కా (meteoric) మూలకమగు ఇనుము కనుగొనబడినది. ఈ ముడిఇనుమునుండి ఎస్కిమో జాతీయులు వారికి అవసరమైన ఆయుధములు తయారుచేసి కొనిరి. ముఖ్యముగా ఉపర్నీవిక్ సమీపమునందు నల్ల సీసపురాయి (graphite) పుష్కలముగా లభించును. 'ఇవిగ్‌టట్' వద్దనే ప్రత్యేకముగా క్రియొలైట్ (cry-olite) అను ఖనిజము దొరకును. అనేక ప్రాంతము లందు రాగిగూడా లభ్యము కాగలదు. తక్కువ తరగతికి చెందిన బొగ్గు డిస్కా అఖాతమునకు సమీపముగా నున్న మండలములందు దొరకును. అక్కడి అనాదిజాతివారు దీపపుబుడ్లు, పాత్రలు తయారుచేసికొనుటకై చాలా కాలము వరకును 'స్టియటైట్' (steatite) లేక 'సోప్‌స్టోన్' (soapstone) అను ఖనిజపదార్థమును ఉపయోగించెడివారు.
శీతోష్ణస్థితి : గ్రీన్‌లాండు నందలి మంచువలన ఉత్తరార్ధ గోళముయొక్క శీతోష్ణస్థితిపై కలుగు ప్రభావమును గూర్చి జరిగిన వాదోపవాదములు అనేక విధములుగా ఉన్నవి. మంచుకప్పుతో కూడిన గ్రీన్‌లాండు నందలి శీతోష్ణ పరిస్థితికి సంబంధించిన లక్షణములలో మిక్కిలి కలవరపరచునది అందులో అధోముఖముగా వీచు వాయు పరంపరయే. (Downward Pressure of winds) పెక్కుమంది యాత్రికులు ఈ దృగ్విషయమును (phenomenon) ధ్రువపరచిరి. పియరీ అనునతడు ఈ సంఘటనమును ఎత్తు ప్రదేశమునుండి నిమ్న ప్రదేశమునకు ప్రవహించెడి నీటి ప్రవాహముతో పోల్చెను. అంతరిక్ష పరిశోధనశాలలనుండి జరుపబడిన పరిశోధనలవలన ఇటీవల ఈవిషయము ధ్రువపడెను. ఈ గాలులలో కొన్ని క్రిందినుండి ఎగువభాగమునకు గూడా వీచునని పరిశోధనలవలన నిరూపింపబడినది. పైని వివరింపబడిన అధోముఖ పవనములను (Downward slope winds) పరిశీలించియే ప్రొఫెసర్ డబ్లియు. హెచ్. హాబ్స్ అనునతడు గ్లేషియర్ ఆంటి సైక్లోన్ (Glacial Anti - Cyclone Theory) అను సిద్ధాంతమును ప్రతిపాదించెను. ఈ సిద్ధాంత విషయమున పలువురు శాస్త్రవేత్తలు మిక్కిలి శ్రద్ధాసక్తులను ప్రకటించిరి. ఈ పరిశోధనముల మూలముననే గ్రీన్‌లాండు 'ఉత్తరార్ధగోళముయొక్క శీతల ధ్రువము' (Cold pole of Northern Hemisphere) అను భావము ఉత్పన్నమైనది.
గ్రీన్‌లాండు యొక్క శీతోష్ణపరిస్థితి అనిశ్చితమైనది. ఉన్నట్లుండి శీతోష్ణ వాతావరణ పరిస్థితులు మారును. దివ్యమైన సూర్యకాంతి ఆకస్మికముగా అదృశ్యమగును. దట్టమగు పొగమంచు ఏర్పడును. లేదా, మంచు కురియును. మిక్కిలి శీతలములైన వాయువులు వీచును. ఉదా : ఫిబ్రవరి నెలలో ఉపర్నీవిక్ యందలి వాతావరణము ఒకప్పుడు 60.8°F ఉన్నట్లును, మరల అదే నెలలో 44.1° ఉన్నట్లును, గ్రీన్‌లాండు సముద్ర తీరప్రాంతమందు కనీసపు శీతోష్ణస్థితి ఉన్నట్లును లెక్కకట్టబడినది. నిమ్నోన్నతమైన స్థలరచన చేతను, లోతైన ఇరుకుమూతి సముద్రపుశాఖలు కారణముగాను, స్థానిక పరిస్థితుల ప్రబల ప్రభావము గ్రీన్‌లాండు నందలి ప్రతిస్థలమునందలి శీతోష్ణస్థితులపైనను ప్రసరించుచున్నది.
తీవ్రముగ ఎండలుకాయు మాసములయందును ‘ఇవిగ్‌టట్' అను ప్రదేశమున తప్ప, తక్కినతావులం దెల్లను శరీరము గడ్డకట్టుకొని పోవునట్టి శీతలవాయువులు వీచునట్లుగా శాస్త్రజ్ఞులు లెక్కకట్టిరి. జులై నెలలో 'ఇవిగ్‌టట్' లో కనిష్ఠశీతోష్ణస్థితి 32.5F గాను ఉన్నట్లు వ్రాసి పెట్టబడినది.
హిమపతనము : గ్రీన్‌లాండులో సంవత్సరమునకు ఈ క్రింది సరాసరి లెక్కలప్రకారము మంచు కురియు చున్నది. 'ఉపర్నివిక్' (Upernivik) లో 9 అంగుళములు ; 'జాకబ్‌షేవెన్' లో (Jakobshaven) 8.5
518